Share News

Hyderabad: భూకబ్జాపై మల్లారెడ్డి హాట్ కామెంట్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సవాల్..

ABN , Publish Date - May 19 , 2024 | 03:10 PM

సుచిత్రలో నెలకొన్న భూవివాదంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. భూమి విషయంలో తన వద్ద ఉన్నవి తప్పుడు డాక్యూమెంట్స్ అని కాంగ్రెస్ నేతలు(Congress Leaders) ఆరోపించడంపై తీవ్రంగా స్పందించారు. తన డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు మల్లారెడ్డి. తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్(MLA Laxman) సిద్ధమా? అని ప్రశ్నించారు.

Hyderabad: భూకబ్జాపై మల్లారెడ్డి హాట్ కామెంట్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సవాల్..
MLA Mallareddy

హైదరాబాద్, మే 19: సుచిత్రలో నెలకొన్న భూవివాదంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. భూమి విషయంలో తన వద్ద ఉన్నవి తప్పుడు డాక్యూమెంట్స్ అని కాంగ్రెస్ నేతలు(Congress Leaders) ఆరోపించడంపై తీవ్రంగా స్పందించారు. తన డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు మల్లారెడ్డి. తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్(MLA Laxman) సిద్ధమా? అని ప్రశ్నించారు. భూమి విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే అన్నీ వదిలేసి పోతానని అన్నారు. ఈ భూమి విషయంలో వారివే ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని ఆరోపించారు మల్లారెడ్డి. ఇదే విషయమై ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి.. సర్వే ఇప్పుడే పూర్తయ్యింది కదా.. రిపోర్ట్ వచ్చే వరకు అందరూ వెయిట్ చేయాలన్నారు. సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి, కలెక్టర్లను కలుస్తానని.. తన వద్దనున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని వారికి చూపిస్తానని మల్లారెడ్డి చెప్పారు.


కొనసాగుతున్న దర్యాప్తు..

మల్లారెడ్డి భూ వివాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. సుచిత్రలో మల్లారెడ్డి భూవివాదంపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఇరువురి సమక్షంలో పూర్తిగా హద్దులను సర్వే చేశారు అధికారులు. సర్వే నెంబర్ 82, 83ను సర్వే విస్తీర్ణాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ సర్వే రిపోర్ట్‌ను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, ల్యాండ్ తమదేనంటూ ఇరు వర్గాల వ్యక్తులు డిమాండ్ చేస్తు్న్న నేపథ్యంలో.. రెవెన్యూ అధికారుల రిపోర్ట్ కీలకంగా మారింది.


మల్లారెడ్డిపై ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఫైర్..

సుచిత్రలోని భూ వివాదంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరును మల్లారెడ్డి ప్రస్తావించారు. దీంతో ఇవాళ లక్ష్మణ్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. శనివారం జరిగిన వివాదంలో తన పేరును ప్రస్తావించడంతోనే తాను మీడియా ముందుకు వచ్చానని క్లారిటీ ఇచ్చారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యంగా భూమిని అక్రమించారని ఆరోపించారు. తాము కొన్న భూమిని ఫేక్ డాక్యుమెంట్లు అని మల్లారెడ్డి చెప్తున్నారని అన్నారు. కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్‌ను వెకేట్ చేయించుకోలేదన్నారు. గతంలో తాము పోలీసులకు, మున్సిపల్ కమీషనర్‌కు పిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని లక్ష్మణ్ ఆరోపించారు. సర్వే అనంతరం చట్టప్రకారం రెవెన్యూ అధికారుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు లక్ష్మణ్. తమ ప్రభుత్వంపై బురద జల్లడం మంచి పద్దతికాదని మల్లారెడ్డికి హితవు చెప్పారు లక్ష్మణ్.


సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..

మల్లారెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతామని ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు. గత ప్రభుత్వం మల్లారెడ్డి గుండాయిజం చేసారని ఆరోపించారు. ప్రస్తుతం వివాదం నడుస్తున్న భూమిలో తనకు కేవలం 600 గజాల స్థలం మాత్రమే ఉందన్నారు. మల్లారెడ్డి నోరు పెద్దదిగా చేస్తే ఎవరు భయపడరన్నారు. ల్యాండ్ లోకి పోవద్దని ఇంజక్షన్ ఆర్డర్‌లో ఉన్నా.. మల్లారెడ్డి లెక్క చేయలేదని, ల్యాండ్ లోకి వెళ్ళారని ఆరోపించారు. సర్వే ప్రకారం తమ ల్యాండ్ తమకు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. 4000 గజాలు తప్ప మిగతా ల్యాండ్‌తో తమకు అనవసరం లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మల్లారెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నారని ఆరోపించారు. 2015లో ఈ ల్యాండ్ సర్వే అవసరం లేదని మల్లారెడ్డి అడ్డుకున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు కరెక్ట్ కాకపోతే ఈ ల్యాండ్ వదిలిపెడతామన్నారు. ల్యాండ్ విషయంలో కోర్టు నోటీసులు జారీ చేసినా మల్లారెడ్డి ఎందుకు స్పందించడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. త్వరలో మల్లారెడ్డి దొంగతనం, ఆయన అసలు బండారం బయటపడుతుందన్నారు. ఈ ప్రభుత్వం చట్టం ప్రకారం పోతుందన్నారు. మల్లారెడ్డి ఇంకా మంత్రి పదవిలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని.. మల్లారెడ్డి లాగా చట్టాన్ని వ్యతిరేకించమని ఎమ్మెల్యే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 19 , 2024 | 03:10 PM