Share News

TG Cabinet Meet: కాళేశ్వరం బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - May 20 , 2024 | 10:08 PM

ఎన్నికల సంఘం షరతుల మేరకు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో జరిగిన ఈ భేటీలో సుమారు 4 గంటలపాటు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

TG Cabinet Meet: కాళేశ్వరం బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం  కీలక నిర్ణయం
TG Cabinet Meet

హైదరాబాద్: ఎన్నికల సంఘం షరతుల మేరకు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో జరిగిన ఈ భేటీలో సుమారు 4 గంటలపాటు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. డ్యామేజ్ జరిగిన బ్యారేజీలను మరమ్మతులు చేయించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది.మరమ్మతులకు ముందు టెక్నికల్ టెస్టులను ప్రభుత్వం చేయించనున్నది.

బ్యారేజ్ సేఫ్టీ ఎక్స్‌పెర్ట్ కంపెనీలతో మంత్రులు అధికారుల బృందం పరిశీలన చేయనున్నది. వచ్చే వర్షాకాలంలో నీళ్లను లిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక మేడిగడ్డ అంశంలో ఎన్‌డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కేవలం సాంకేతిక పరమైన నిర్ణయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా అన్ని అంశాలను ఇంజనీర్లతో మాట్లాడి ముందుకు వెళతామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం , సుందిళ్లను సందర్శిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.ఈ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 10:08 PM