Share News

Rain Alert : హైదరాబాద్‌ వాసులకు అలెర్ట్‌.. ఈ ప్రాంతాల్లో...

ABN , Publish Date - May 26 , 2024 | 06:42 PM

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రెమాల్ తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. నేడు(ఆదివారం) మధ్యాహ్నం ఒక్కసారిగా మేఘావృతమే పలు ప్రాంతాల్లో భారీ వాన పడింది.

Rain Alert : హైదరాబాద్‌ వాసులకు అలెర్ట్‌.. ఈ ప్రాంతాల్లో...

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy rain) కురిసింది. రెమాల్ తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. నేడు(ఆదివారం) మధ్యాహ్నం ఒక్కసారిగా మేఘావృతమే పలు ప్రాంతాల్లో భారీ వాన పడింది. నగరంలోని అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌, మల్కాజిగిరి, తుర్కయంజాల్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

r1.jpg

ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ ఈదురుగాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురంలో ఈదురు గాలులకు గణేశ్‌ దేవాలయం ప్రాంగణం, ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రహదారిపై, రైతు బజార్ సమీపంలో పార్కు వద్ద భారీ చెట్లు నేలకొరిగాయి. సకాలంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేరుకుని రహదారిపై పడిన చెట్లను తొలగిస్తున్నారు.


R-2.jpg

మేడ్చల్‌ జిల్లాలో ఇద్దరి మృతి

కాగా.. మేడ్చల్‌ జిల్లాలోని కీసర మండలంలో ఈదురుగాలులు, భారీ వర్షానికి తిమ్మాయిపల్లి- శామీర్‌పేట్‌ దారిలో చెట్టు కూలి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై చెట్టు విరిగిపడటంతో నాగిరెడ్డి రామ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందరు. మరో వ్యక్తి ధనుంజయకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులను యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు

Minister Tummala: నా లక్ష్యం అదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

TG Politics: బీఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారు.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

TG Politics: మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం: మంత్రి ఉత్తమ్

Read Latest Telangana News and Telugu News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 09:51 PM