Share News

Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్లపై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

ABN , Publish Date - May 24 , 2024 | 09:06 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ వేశారు.

Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్లపై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్టయి (Arrest) తిహార్ జైల్లో (Tihar Jail) ఉన్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్లపై (Bail petitions) శుక్రవారం ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt)లో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ (Justice Swarnakanta Sharma) ధర్మాసనం విచారణ జరపనుంది. ఈడీ (ED), సీబీఐ (CBI) కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్ర ఉందని ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రయల్ కోర్టు బెయిల్ త్కరస్కరించింది. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 16న, సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!

పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్

పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌

ఇద్దరికీ ఇదే లాస్ట్‌ చాన్స్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 24 , 2024 | 09:09 AM