Share News

Congress: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ సభ.. ఏర్పాట్లు ఏ రేంజ్‌లో చేశారో తెలిస్తే..

ABN , Publish Date - Apr 06 , 2024 | 08:03 AM

నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ జరిగింది. జన జాతర సభకు తరలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సభకు చీఫ్ గెస్ట్‌గా రాహుల్ గాంధీ రానున్నారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను రాహుల్ తెలుగులో విడుదల చేయనున్నారు. తెలంగాణకు సంబంధించిన 23 అంశాలను ఏఐసీసీ మేనిఫెస్టోలో చేర్చింది.

Congress: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ సభ.. ఏర్పాట్లు ఏ రేంజ్‌లో చేశారో తెలిస్తే..

హైదరాబాద్: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ జరిగింది. జన జాతర సభకు తరలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సభకు చీఫ్ గెస్ట్‌గా రాహుల్ గాంధీ (Rahul Gandhi) రానున్నారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను రాహుల్ తెలుగులో విడుదల చేయనున్నారు. తెలంగాణకు సంబంధించిన 23 అంశాలను ఏఐసీసీ మేనిఫెస్టోలో చేర్చింది. మేడారం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంతో పాటు విభజన సమయంలో ఏపీలో కలిపిన 5 మండలాలను తెలంగాణలో కలుపుతాం.. హైదరాబాద్‌లో నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయానికి హామీ ఇవ్వడం జరిగింది. వంద రోజుల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలను ప్రజలకు రేవంత్ వివరించనున్నారు.

కేసీఆర్‌ కుటుంబానికి రూ.2లక్షల కోట్ల ఆస్తులున్నాయ్‌!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..


తుక్కుగూడ సభ కోసం టీపీసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. 60 ఎకరాల్లో సభాస్థలాన్ని ఏర్పాటు చేసింది. 300 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు జరిగాయి. సభలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రాహుల్, ప్రియాంక, రేవంత్, మంత్రులు ఉండనున్నారు. మరో వేదికపై ఎమ్మేల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు.. ఇక మూడో వేదికను సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక నుంచి జనాల మధ్యలోకి 200 మీటర్ల ప్రత్యేక ర్యాంప్‌ను నిర్మించారు. ర్యాంప్‌పై జనాల మధ్యలోకి వచ్చి రాహుల్ గాంధీ అభివాదం చేయనున్నారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పది లక్షల మంది వస్తారని హస్తం నేతలు అంటున్నారు. ఎండాకాలం కావడంతో నీళ్ళు, మజ్జిగ ప్యాకెట్ల కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు.

KCR : గద్ద లెక్క వాలుతా!

Updated Date - Apr 06 , 2024 | 08:03 AM