Share News

Kavitha: ఆరోగ్య పరిస్థితిపై కోర్టులో కవిత పిటిషన్.. ఇంతకీ ఏమైంది?

ABN , Publish Date - Mar 23 , 2024 | 12:22 PM

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కుంటున్నారు. అయితే విచారణ సమయంలో కవిత తీవ్రమైన రక్తపోటును ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్‌ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్‌లో తెలిపారు.

Kavitha: ఆరోగ్య పరిస్థితిపై కోర్టులో కవిత పిటిషన్.. ఇంతకీ ఏమైంది?

న్యూఢిల్లీ, మార్చి 23: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కుంటున్నారు. అయితే విచారణ సమయంలో కవిత తీవ్రమైన రక్తపోటును (High BP) ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్‌ఏ కోర్టులో (PMLA Court) కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్‌లో తెలిపారు. వైద్య పరీక్షలు నివేదికలిచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ రికార్డ్స్ రిపోర్ట్స్ అందించాలంటూ ఎమ్మెల్సీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Kavitha: కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు అందుకేనా..?


ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈనెల 15 నుంచి కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో తనకు నిర్వహించిన మెడికల్ రిపోర్ట్స్ అందించాలని పిటిషన్‌లో కోరారు. అరెస్ట్ అయిన 15వ తేదీ నుంచి హైపర్ టెన్షన్‌తో కవిత ఇబ్బంది పడుతున్నారు. 15న న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సమయంలోనే హైపర్ టెన్షన్ విషయాన్ని తన న్యాయవాదికి కవిత చెప్పారు. ఆ విషయాన్ని కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కవిత తరపు న్యాయవాదులకు మెడికో లీగల్ రిపోర్ట్ అందించాలని ఈడీని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే కోర్టు ఆదేశించిన తర్వాత కూడా కేవలం 15 ,16వ తేదీల మెడికల్ రిపోర్ట్ మాత్రమే అందించారని కవిత పిటిషన్‌లో వెల్లడించారు.

Hyderabad: పోటీకి పజ్జన్న ఓకే.. అధినేత సూచనతో మనసు మార్చుకున్న వైనం


తన తరపు న్యాయవాదులు కోరినప్పటికీ కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి మెడికో లీగల్ రిపోర్ట్‌లు అందించలేదని తెలిపారు. 15, 16వ తేదీల్లో అందించిన మెడికల్ రిపోర్ట్స్‌లో రక్తపోటు 186/103 గా ఉందని, రక్తపోటు నియంత్రణ కోసం చిన్నపాటి ఇంజక్షన్ ఇచ్చినప్పటికి రక్తపోటు 146/96 గా ఉందని ఎమ్మెల్సీ పిటిషన్‌లో పేర్కొన్నారు. హైపర్ టెన్షన్ తగ్గించేందుకు మెడిటేషన్ చేస్తున్నప్పటికీ తగిన ఫలితాలు కనిపించడం లేదని తెలిపారు. కస్టడీలో హైపర్ టెన్షన్ నియంత్రణలోకి రావడం లేదని.. 15వ తేదీ నుంచి అన్ని వైద్య పరీక్ష నివేదికను అందించాలని కవిత తన పిటిషన్‌ కోరారు.

Delhi Liquor Scam: కవితకు మరో బిగ్ షాక్.. మళ్లీ ఈడీ సోదాలు!

నేటితో కస్డడీ ముగింపు..

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. మరికాసేపట్లో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచి మరో ఐదు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీని బట్టి చూస్తే కేజ్రీవాల్, కవితను కలిపి విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి..

KA Paul: ఇదే నా శాపం.. మీడియా సంస్థలకు కేఏ పాల్ హెచ్చరిక

Chandrababu: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు కీలక భేటీ.. Watch Live


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 12:34 PM