Share News

Kavitha: కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు అందుకేనా..?

ABN , Publish Date - Mar 23 , 2024 | 10:41 AM

ED Raids On Kavitha Family Members: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి ఈడీ (ED) అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Kejriwal) అరెస్టులు జరిగాయని హస్తిన వర్గాలు చెబుతున్న మాట..

Kavitha: కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు అందుకేనా..?

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి ఈడీ (ED) అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Kejriwal) అరెస్టులు జరిగాయని హస్తిన వర్గాలు చెబుతున్న మాట. ఇక అసలు విషయానికొస్తే.. కవిత ఈడీ కస్టడీలో ఉండగానే మరోసారి బిగ్ షాక్ తగిలింది. కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. శనివారం ఉదయం 6:30 గంటలకే హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ అధికారులు కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఏడుగురు ఈడీ అధికారుల బృందం ఈ సోదాలు చేస్తోంది. కవిత అరెస్ట్ అనంతరం ఇలా సోదాలు జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇంత సడన్‌గా సోదాలు ఎందుకు..? కవితను ఇప్పట్లో ఈడీ వదలదా అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది.

MLC Kavitha: ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన కుమారుడు ఆర్య..


kavitha-twitter.jpg

సోదాలు వెనుక..?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆరు రోజులపాటు ఈడీ కస్టడీలో ఉన్న కవిత నుంచి కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారంతోనే మరోసారి ఈడీ రంగంలోకి దిగిందని సమాచారం. ఉదయం నుంచి జరిగిన సోదాల్లో కీలక పత్రాలు, సమాచారం రాబట్టినట్లు తెలియవచ్చింది. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు.. కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ బ్యాంకు లావాదేవీలను నిశితంగా పరిశీలించగా.. ఆడపడుచు అఖిల విషయం బయటికొచ్చిందని అందుకే ఈ సోదాలనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. వాస్తవానికి.. కవిత తర్వాత ఇదే కేసులో మరిన్ని అరెస్టులు, మళ్లీ సోదాలు జరిగే అవకాశం ఉందని వారం రోజులుగా వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. సీన్ కట్ చేస్తే.. ఆ వార్తలన్నీ తాజాగా జరుగుతున్న సోదాలతో అక్షరాలా నిజమవుతున్నాయి. ఈ సోదాల తర్వాత ఏం జరుగుతుంది..? తనిఖీల్లో ఏం దొరుకుతాయి..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు.

Kavitha-ED.jpg

మళ్లీ పొడిగిస్తారా..?

గత ఆరు రోజులుగా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్‌లో కవితను ఈడీ విచారిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు సహా ఇతర ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేటితో కవిత కస్టడీ ముగియనుంది. ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచి మరో ఐదు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీని బట్టి చూస్తే కేజ్రీవాల్, కవితను కలిపి విచారించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే.. ఇప్పుడు హైదరాబాద్‌లో సోదాలు జరుగుతుండటంతో.. కవితను కచ్చితంగా కస్టడీకి ఇవ్వాల్సిందేనని.. కోర్టును ఈడీ కోరే అవకాశముందని క్లియర్ కట్‌గా అర్థమవుతోంది.

Enforcement-Directorate.jpg

మరిన్ని తెలంగాణ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 11:50 AM