Share News

Shakeel: నా కొడుకును చంపేస్తామంటున్నారు.. బోధన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 17 , 2024 | 04:55 PM

Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కొడుకును అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపిస్తున్నారు. అసలు ఈ కేసులో తన కుమారుడి ప్రమేయమే లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంపై సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కావాలనే వెస్ట్‌ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే.

Shakeel: నా కొడుకును చంపేస్తామంటున్నారు.. బోధన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Bodhan Former MLA Shakeel Respond on Jubileehills Road accident case

హైదరాబాద్, ఏప్రిల్ 17: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో (Jubilee Hills Road Accident Case) ఎన్నో మలుపులు తిరిగింది. గత రెండేళ్లుగా ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Bodhan Former MLA Shakeel Son) కుమారుడి చుట్టూనే ఈ కేసు తిరుగుతోంది. ఈ కేసులో అఫ్నాన్‌ను గతంలో నిందితుడిగా చేర్చారు. అయితే ప్రమాద సమయంలో షకీల్ కుమారుడు రాహెల్ డ్రైవ్ చేశారని.. అతడిని తప్పించడానికి ప్రయత్నాలు చేశారనే వాదనలు కూడా వినిపించాయి. ఇప్పుడు తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు చేపట్టారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసులో షకీల్ కొడుకును నిందితుడిగా చేర్చారు కూడా..

Ayodhya Photos: బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు.. అబ్బురపరుస్తున్న ఫొటోలు


అయితే తన కొడుకును అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపిస్తున్నారు. అసలు ఈ కేసులో తన కుమారుడి ప్రమేయమే లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంపై సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కావాలనే వెస్ట్‌ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే.

IPL 2024: రూ.25 కోట్లు వేస్ట్.. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్‌పై విమర్శలు.. అతడి సమాధానం ఏంటంటే..


బుధవారం షకీల్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘నా కుమారుడి తప్పు ఉంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటా. నా కుమారుడిని కేసులో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీసీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారు. నా కుమారుడు చేయని తప్పుకు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడి ప్రమేయం లేదు. దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. కేసు ట్రయల్‌లో ఉంది. నాపై రాజకీయ కక్ష వుంటే నా కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నా కుమారుడు కారు బారికేడ్లకు తగిలితే నా కుమారుడిపై 21 సెక్షన్ల కేసులు పెట్టారు. కేసు పారదర్శకంగా విచారణ చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా. నా ఆరోగ్యం బాగాలేకపోయినా నాపై ఎఫ్.ఐ.ఆర్ చేశారు. నేను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేశాను. నా కుమారుడిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. నా కొడుకును చంపేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. నా కుమారుడికి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ, పంజాగుట్ట ఏసీపీ, సీఐ, జూబ్లీహిల్స్ సీఐ బాధ్యత వహించాలి. నా కుమారుడు మానసిక ఒత్తిడికి గురి అయితే హాస్పిటల్‌లో చికిత్స తీకుంటున్నారు’’ అంటూ షకీల్ మీడియా ముందు వాపోయారు.


ప్రమాదం జరిగింది ఇలా..

రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు నెలల చిన్నారి మృతి చెందాడు. ఓ మహిళ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు డీకొట్టగా.. ఈ ప్రమాదంలో కాజోల్ రెండు నెలల కొడుకు రన్వీర్ మృతి చెందాడు. కాజోల్ తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరగిన వెంటనే కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా అది ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

Viral Video: వరదలను ఇలా వాడేసుకున్నారు.. వీళ్ల బిజినెస్ మామూలుగా లేదుగా..


ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే కారు ఎవరు నడిపారనే దానిపై పోలీసులు అనేక రకాలుగా దర్యప్తు చేపట్టినప్పటికీ స్పష్టత రాలేదు. చివరకు కారు తానే నడిపానంటూ ఆఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. దాంతో కేసులో ఆఫ్నాన్‌ను నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఛార్జ్‌షీట్‌ను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు దాఖలు చేశారు. అయితే తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు చేపట్టారు. అలాగే కేసును 304 పార్ట్ 2గా సెక్షన్లుగా మార్చారు.


ఇవి కూడా చదవండి...

Hyd News: హైదరాబాదీ మాంస ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ ఆదివారం నాన్-వెజ్ దొరకదు

Loksabha Elections 2024: అభ్యర్థుల నామినేషన్లపై తెలంగాణ బీజేపీ నయా ప్లాన్.. తరలిరానున్న నేషనల్ లీడర్స్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 17 , 2024 | 05:48 PM