Share News

Harish Rao: లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి

ABN , Publish Date - Apr 18 , 2024 | 09:06 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారానికి వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) హెచ్చరించారు. గురువారం నాడ బెజ్జెంకిలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు.

Harish Rao: లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి

సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారానికి వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) హెచ్చరించారు. గురువారం నాడ బెజ్జెంకిలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. కార్నర్ మీటింగ్లె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బోర్లలో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, తాగడానికి నీళ్లులేవని విరుచుకుపడ్డారు. పంటలు ఎండిపోతున్నాయి. కరెంటు ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.


Loksabha polls: కాసేపట్లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇవ్వనున్న కేసీఆర్

వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారన్నారు. రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌కు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో వడ్లను గిట్టుబాటు ధరకు కొన్నామన్నారు. రూ. 500 బోనస్‌తో రూ.2500కు కొంటామన్న రేవంత్... ఇప్పుడు రైతులు రూ.1800లకే అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

కేసీఆర్ కరోనా సమయంలో సైతం రైతుబంధు ఆపలేదన్నారు. రేవంత్ రైతులకిచ్చిన రైతుబంధు రూ.15వేలు, కౌలురైతులకు రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తామని ఒక్క హామీని కూడా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. పైగా రూ. 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు.


CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే..

అవ్వాతాతలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని వాళ్లనూ మోసం చేశారని ధ్వజమెత్తారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని రేవంత్ చెప్పారని... వాళ్లకు రూ. 10 వేలు బాకీపడ్డారన్నారు. ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నాడన్నారు. రెండు నెలల్లో లక్ష లగ్గాలు జరిగాయని... రేవంత్ ఇస్తానన్నా లక్ష, తులం బంగారం బాకీ పడ్డాడని అన్నారు.

మన గుండెలమీద తన్నిన రేవంత్ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో గడ్డపారలై పోటుపొడవాలని విమర్శించారు. 4 నెలలైనా హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోదామా? అని ప్రశ్నించారు. బీజేపీ పదేళ్ల పాలన ప్రజలకు ఒక్క మేలైనా చేసిందా? అని నిలదీశారు. చెప్పుకోడానికి ఏమీ లేదు కనుక క్యాలండర్లు, అక్షింతలు పంచుతున్నారని ఎద్దేవా చేశారు.


Supreme Court: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. మరోసారి..

ధరలు పెంచి మోదీ ప్రభుత్వం గరీబోళ్ల నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు. బెజ్జంకిలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న ప్రజలకు అండగా ఉంటానని మాటిచ్చారు. ప్రశ్నించే గొంతులను ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మెడలు వంచి హమీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్‌కు రైలు, కోట్ల నిధులు తెచ్చారని గుర్తుచేశారు. పబ్లిసిటీ చేసేవాళ్లు కావాలా, పనిచేసేవాళ్లు కావాలా? అని ప్రశ్నించారు. అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేతలు నేలకు దిగిరావాలంటే వినోద్‌ కుమార్‌ను పార్లమెంటుకు పంపాలని హరీశ్‌రావు కోరారు.


Jagadish Reddy: కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామన్న మాజీ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 18 , 2024 | 10:51 PM