Share News

TG Politics: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి.. సీఎం రేవంత్‌పై హరీష్ ఆగ్రహం

ABN , Publish Date - Apr 11 , 2024 | 03:59 PM

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ (Congress)కి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. గురువారం నాడు చిన్నకోడూరు మండలం పెద్ద కోడూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ పాల్గొన్నారు.

TG Politics: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి.. సీఎం రేవంత్‌పై హరీష్ ఆగ్రహం

సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ (Congress) కి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. గురువారం నాడు చిన్నకోడూరు మండలం పెద్ద కోడూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ పాల్గొన్నారు.


CM Revanth: ధాన్యం కొనుగోళ్లల్లో నిర్లక్ష్యం వహించొద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్ రాంరెడ్డిని గెలిపించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య హయాంలో 6 గంటలు మాత్రమే కరెంట్ వచ్చేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంట్, సాగునీరు ఇచ్చారని గుర్తుచేశారు.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరువు తెచ్చిందని విమర్శించారు. తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల రుణమాఫీ అయినా రైతులు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి... రుణామాఫీ కానివారు బీఆర్ఎస్‌కి ఓటు వేయాలని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ఓట్లు కోసం వచ్చే ఆ పార్టీ నేతలను మహిళలు చీపురు కట్టలతో తరమాలాని వార్నిగ్ ఇచ్చారు.


Padi Koushik Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలి పెట్టం

కాంగ్రెస్‌కి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేస్తే మన కంటిని మనం పొడుచుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. సిద్దిపేట అభివృద్ధిని ఓర్వని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావుకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఏ ఒక్క హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఆయనను దుబ్బాక ప్రజలు ఘోరంగా ఓడించారని అన్నారు.


10 ఏళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిందని.. పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు పెరిగాయని మండిపడ్డారు. బీజేపీ నల్ల చట్టలు తెచ్చి 700మంది రైతులను పొట్టన పెట్టుకుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి గులాం గిరి చేస్తే, గులాబీ జెండా పట్టుకున్నోళ్లు జై తెలంగాణ అని నినదిస్తారని హరీశ్‌రావు అన్నారు.


జిల్లా అభివృద్ధికి కృషి చేశా: వెంకట్ రాంరెడ్డి

తాను కలెక్టర్‌గా ఉన్న సమయంలో మెదక్ ఉమ్మడి జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి (Venkat Ram Reddy) తెలిపారు. ప్రజల ఆదరణతో తాను ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నానని చెప్పారు. తాను అంచెలంచెలుగా కలెక్టర్ వరకు ఎదిగానని అన్నారు. తాను ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద బలహీన వర్గాలకు సహాయం అందిస్తానని వెంకట్ రాంరెడ్డి హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

KTR: పూలే ఎంచుకున్న మార్గం అందరికీ ఆచరణీయం..

Revanth Reddy: ఢిల్లీకి రేవంత్.. ఈసారైనా క్లారిటీ వస్తుందా?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 04:02 PM