Share News

Eatala Rajendar: తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ సర్కార్

ABN , Publish Date - May 25 , 2024 | 06:08 PM

తెలంగాణను కాంగ్రెస్ నేతలు అప్పుల కుప్పగా మారుస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajendar) ఆరోపించారు. కొత్తగూడెంలో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Eatala Rajendar: తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ సర్కార్
Eatala Rajendar

హైదరాబాద్: తెలంగాణను కాంగ్రెస్ నేతలు అప్పుల కుప్పగా మారుస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajendar) ఆరోపించారు. కొత్తగూడెంలో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి విజయాన్ని కాక్షింసూ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కేసీఆర్‌పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని చెప్పారు. రేవంత్ హామీలు తెలంగాణను అప్పులపాలు చేస్తాయని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రశ్నించే గొంతు కాదని అన్నారు.


దేశ ప్రతిష్ఠను పెంచిన ప్రధాని మోదీకి పట్టభద్రులు అండగా నిలవాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తొలి తూట దిగింది కొత్తగూడెం గడ్డపైనేనని గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ సాగించిన అప్పుల పాలనను కాంగ్రెస్ కొనసాగిస్తుందని ఈటల ఫైర్ అయ్యారు. ఓటు హక్కు పట్టభద్రుల భవిష్యత్తును మారుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాగా... ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27వ తేదీ సోమవారం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడు జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ నుంచి రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. దాంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 27వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. గ్రాడ్యుయేట్ బై పోల్ బరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52 మంది బరిలో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: రాష్ట్రంలో RUB ట్యాక్స్.. బీజేపీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు

TG Politics: అబద్ధాల గ్యారెంటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్: రామచంద్రరావు

TG Politics: వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల మార్పిడి: మంత్రి ఉత్తమ్

Balmoori Venkat:జీఓ 46 పైన పచ్చి అబద్ధాలు చెబుతున్న కేటీఆర్

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 25 , 2024 | 06:25 PM