Share News

Drivers: డ్రైవరన్నా.. ఒక్కసారి మా మాట వినన్నా.. 🙏🙏

ABN , Publish Date - Apr 23 , 2024 | 07:24 PM

డ్రైవరన్నా.. మీకిది తగునా.. మీ చిన్న పొరపాటు.. కోటి ఆశలతో రెక్కలు విప్పుతున్న మా జంటను బలితీసుకుందన్నా.. పెళ్లై రెండేళ్లే అయ్యిందన్నా.. ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.. పుట్టబోయే పిల్లల కోసం.. అందమైన జీవితం కోసం ఎన్నెన్నో కలలు కన్నాం.. భవిష్యత్ కోసం మరెన్నో ప్రణాళికలు రచించాం.. అవన్నీ క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి కదన్నా..

Drivers: డ్రైవరన్నా.. ఒక్కసారి మా మాట వినన్నా.. 🙏🙏
Road Safety

డ్రైవరన్నా.. మీకిది తగునా.. మీ చిన్న పొరపాటు.. కోటి ఆశలతో రెక్కలు విప్పుతున్న మా జంటను బలితీసుకుందన్నా.. పెళ్లై రెండేళ్లే అయ్యిందన్నా.. ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.. పుట్టబోయే పిల్లల కోసం.. అందమైన జీవితం కోసం ఎన్నెన్నో కలలు కన్నాం.. భవిష్యత్ కోసం మరెన్నో ప్రణాళికలు రచించాం.. అవన్నీ క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి కదన్నా.. భార్య పుట్టిన రోజు వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి సంబురంగా చేసుకున్నాం.. ఆ ఆనంద క్షణాలు కళ్ల ముందు కదలాడుతుండగానే కాటికి చేరాల్సి వచ్చింది కదన్నా.. రెండు గడియల ముందు నిండైన నవ్వుతో సాగనంపిన మా తల్లిదండ్రులు.. ఇప్పుడు కన్నీటిపర్యంతం అవుతున్నారన్నా😭.. డ్రైవరన్నా ఎందుకిలా చేశావ్ 😭.. అలసిపోయావా? నిద్రవస్తుందని ఆగిపోయావా? కారణమేదైనా రోడ్డుపై నీవు నిలిపిన లారీ మా నిండు జీవితాలను బలితీసుకుందన్నా.. మా తల్లిదండ్రులకు గుండెకోతకు కారణమైందన్నా.. అందమైన మా ఆశలన్నీ అవిరైపోయాయన్నా.. డ్రైవరన్నా ఇకనైనా మారన్నా..


అవును.. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరింది మొదలు.. తిరిగి అంతే క్షేమంగా ఇంటికి వస్తారా? కనీసం గమ్యాన్ని చేరుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కారణం.. ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఒకవేళ ఇవతలి వాళ్లు సరిగా ఉన్నా.. అవతలి వాళ్ల నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా.. వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అన్నెంపున్నెం తెలియని అమాయక జనాలు చనిపోతుంటే.. వారిని నమ్ముకున్న వాళ్లు దిక్కు మొక్కు లేకుండా పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ.. వారి కుటుంబ సభ్యులు దిక్కులేని వారై పోతున్నారు.

ఇదికూడా చదవండి: కార్పొరేటర్‌కు సారీ చెప్పిన కర్ణాటక సీఎం.. ఎందుకంటే..?


తాజాగా సూర్యాపేట జిల్లా మునగాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. యావత్ తెలుగు ప్రజలను తీవ్ర కలవరానికి గురి చేసింది. ఇక్కడ తప్పు ఎవరిది అన్న విషయం పక్కనబెడితే.. రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారిని నమ్ముకున్న, వారి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు మిన్నంటి రోధిస్తున్నారు. ఈ జంటకు రెండేళ్ల క్రితమే పెళ్లవగా.. భార్య పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. తిరుగు పయనంలో ఆ జంటను రోడ్డు పక్కన ఉన్న లారీ రూపంలో మృత్యువు కబళించింది. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో ఉన్న దంపతులిద్దరూ.. పెళ్లైన తరువాత కోటి ఆశలతో.. భవిష్యత్‌పై బోలెడు అంచనాలతో.. తమకు పుట్టబోయే పిల్లల భవిష్యత్ ఇలా ఉండాలని కలలు కంటూ.. సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ, ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు వారిని మింగేసింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి తోడు.. కారు అతివేగం.. ఆ జంట శరీరాలు చిధ్రమైపోయాయి.

ఇదికూడా చదవండి: హాస్టళ్లలో ఇలాంటి సమస్య కూడా రావొచ్చు.. పాపం..! ఇతడి పరిస్థితి ఏమైందంటే..


నిర్లక్ష్యం, అతివేగం..

ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. ప్రమాదాలను నివారించండి అంటూ లేచింది మొదలు ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలపై అవేర్‌నెస్ కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. కానీ, పట్టించుకునేదెవరు? కాస్త ఆలస్యం అయితే కొంపలు మునిగిపోయినట్లుగా వాహనదారులు యమ స్పీడ్‌గా తమ వాహనాలను నడిపేస్తుంటారు. మరికొందరు.. రోడ్లేవో తమ జాగీరు అయినట్లుగా ఎక్కడపడితే.. ఎలా పడితే అలా వాహనాలను రోడ్లపైనే నిలుపుతారు. అదేమంటే.. మా ఇష్టం అని దబాయిస్తారు. ఫైన్లు, చలాన్లను వీరు అస్సలు లక్ష్యపెట్టరు. ఇలాంటి నిర్లక్ష్యాల కారణంగానే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దయచేసి ఇకనైనా మారండి.. మిమ్మల్ని నమ్ముకుని ఎంతో మంది ఇంట్లో ఉండి ఉంటారు. మీ కుటుంబాలు మీపైనే ఆధారపడి ఉంటాయి. మీ చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా.. మీ ప్రాణాలే కాదు.. అబంశుబం తెలియని అమాయకులు సైతం బలైపోతున్నారు. వారి కుటుంబాలు దిక్కులేనివి అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో తల్లిదండ్రుల ప్రాణాలు కోల్పోయి పిల్లలు అనాథలు మారడం.. పిల్లలు ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులు దిక్కులేనివారు అవుతున్నారు.

ఇదికూడా చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఎంటంటే..?


హృదయవిదారక ఘటనలు..

మద్యం మత్తులో, అతివేగంగా వాహనాలు నడిపి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గతంలో హైదరాబాద్‌లో పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై నుంచి కారు పల్టీకొట్టి అబశుబం తెలియని ఓ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. అదొక్కటే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోనూ ఘోర ప్రమాదం జరిగంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబంలో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఇలా నిత్యం ఎక్కడో చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు వాహనాలు నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు.

ఇదికూడా చదవండి: కాంగ్రెస్ గెలిస్తే షరియా చట్టం తెస్తారు.. యోగి తీవ్ర ఆరోపణ


ట్రాఫిక్ రూల్స్ పాటించండి..

ఇకనైనా నిర్లక్ష్యం వీడండి.. కాస్త ఆలస్యమైతే కొంపలేం మునిగిపోవు. వాహనాలను నార్మల్ స్పీ్డ్‌లోనే నడపండి. డ్రైవింగ్ చేస్తున్న వారు ఒక్క క్షణం మిమ్మల్ని నమ్ముకున్నవారిని, మీ కుటుంబ సభ్యులను గుర్తుకుతెచ్చుకోండి. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. డ్రంక్ అండ్ డ్రైవ్ వీడండి. బైకర్స్ హెల్మెట్ ధరించండి.. కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేయడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే పార్క్ చేయండి. మద్యం తాగా వాహనాలు నడపకండి. డ్రైవింగ్ సమయంలో నిద్ర వస్తే.. పార్కింగ్ ప్లేస్‌లో మీ వాహనాన్ని పార్క్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. ఆ తరువాతే వాహనాన్ని డ్రైవ్ చేయండి.

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 23 , 2024 | 07:32 PM