Share News

Siddaramaiah: కార్పొరేటర్‌కు సారీ చెప్పిన కర్ణాటక సీఎం.. ఎందుకంటే..?

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:47 PM

కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరెమత్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) క్షమాపణలు చెప్పారు. ఇటీవల నిరంజన్ కూతురు నేహా దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. హత్య తర్వాత కార్పొరేటర్ నిరంజన్‌ ఇంటికి మంత్రి హెచ్ కే పాటిల్ వెళ్లారు.

Siddaramaiah: కార్పొరేటర్‌కు సారీ చెప్పిన కర్ణాటక సీఎం.. ఎందుకంటే..?
Siddaramaiah

బెంగళూర్: కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరెమత్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) క్షమాపణలు చెప్పారు. ఇటీవల నిరంజన్ కూతురు నేహా దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. హత్య తర్వాత కార్పొరేటర్ నిరంజన్‌ ఇంటికి మంత్రి హెచ్ కే పాటిల్ వెళ్లారు. ఘటనపై సీఎం సిద్దరామయ్య సారీ చెప్పారని తెలిపారు. ఈ విపత్కర సమయంలో మేం మీ పక్షాన నిలుస్తామని వివరించారు.

Raghurami Reddy: అసలు ఎవరీ రఘురామి రెడ్డి?.. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి, ఇద్దరు మంత్రులను కాదని ఖమ్మం సీటు దక్కించుకున్న నేత


‘నేహాను హతమార్చిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య భరోసా ఇచ్చారు. ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సీఐడీ) విచారిస్తోంది. కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తాం అని’ మంత్రి పాటిల్ నిరంజన్ కుటుంబ సభ్యులకు వివరించారు. కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించడం, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో సీఎం సిద్దరామయ్యకు నిరంజన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.


ఏం జరిగిందంటే..?

నిరంజన్ కూతురు నేహా హుబ్లీలో గల బీవీబీ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. అంతకుముందు ఫయాజ్‌ అనే వ్యక్తితో పరిచయం ఉంది. దానిని అతడు ఆసరాగా తీసుకున్నాడు. ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని నేహాపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అందుకు నేహా అంగీకరించలేదు. ఎలాగైనా సరే మట్టుబెట్టాలనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 18వ తేదీన క్యాంపస్‌‌లో ఉన్న నేహాపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది. నేహా చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. నేహాను హత్య చేసిన ఫయాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Latest National News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 05:47 PM