Share News

Raghurami Reddy: అసలు ఎవరీ రఘురామి రెడ్డి.. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆయనకే కన్ఫామా?

ABN , Publish Date - Apr 23 , 2024 | 04:59 PM

ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగంలోకి దిగి తన భార్య నందిని కోసం.. జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు తన కొడుకు యుగంధర్ కోసం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సొదరుడు ప్రసాద్ రెడ్డి కోసం... అంతేనా పార్టీ సీనియర్ మండవ వెంకటేశ్వరరావు, ఆ తర్వాత రాయల నాగేశ్వరరావు పేరు.. అంతకంటే ముందు పార్టీ కురువృద్ధుడు వీహెచ్ హనుమంత రావుతో పాటు పలువురు సీనియర్లు ఆశించిన ఖమ్మం లోక్‌సభ సీటు ఎవరూ ఊహించని రీతిలో..

Raghurami Reddy: అసలు ఎవరీ రఘురామి రెడ్డి.. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆయనకే కన్ఫామా?

ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగంలోకి దిగి తన భార్య నందిని కోసం.. జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు తన కొడుకు యుగంధర్ కోసం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సొదరుడు ప్రసాద్ రెడ్డి కోసం... అంతేనా పార్టీ సీనియర్ మండవ వెంకటేశ్వరరావు, ఆ తర్వాత రాయల నాగేశ్వరరావు పేరు.. అంతకంటే ముందు పార్టీ కురువృద్ధుడు వీహెచ్ హనుమంత రావుతో పాటు పలువురు సీనియర్లు ఆశించిన ఖమ్మం లోక్‌సభ సీటు ఎవరూ ఊహించని రీతిలో రామ‌స‌హాయం రఘురాం రెడ్డి పేరు ఖమ్మం అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు.. ఖమ్మం టికెట్ ఆయనకే ఖరారైందట!. అధికారికంగా ఈ విషయం ప్రకటించనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్‌గా మాత్రం గట్టి ప్రచారమే జరుగుతోంది.


ఖమ్మం టికెట్ రాఘురామిరెడ్డికి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్లు విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. రాజకీయ ఎత్తుగడలు, లాబీయింగ్‌లు చేసినప్పటికీ.. పార్టీలో ముఖ్య నాయకులు పోటీ పడ్డప్పటికీ అందరినీ కాదని రాఘురామి రెడ్డి పేరు కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసిందట. పార్టీకి అత్యంత బలమున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు సంబంధించిన వ్యవహరం, పార్టీలో ముఖ్య నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న ఖమ్మం సీటు పంచాయితీని కాంగ్రెస్ ఎంతో జాగ్రత్తగా డీల్ చేసిందని.. వ్యూహంలో భాగంగానే రామిరెడ్డి పేరును ఫైనల్ చేసిందని టాక్ నడుస్తోంది. ఓవైపు నామినేషన్లు పర్వం కొనసాగుతుండగా.. ఖమ్మం సీటు విషయంలో ఇప్పటికీ అంతే స్తబ్ధత నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆలస్యమైందని భావించొచ్చు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగి రాహుల్ గాంధీకి రెండు పేర్లను సిఫార్స్ చేశారట. దీనిలో ఒక పేరుని రాహుల్ ఎంపిక చేయడంతో ‘ఖమ్మ సస్పెన్స్’ వీడినట్టు తెలుస్తోంది.


ఎవరీ రఘురామి రెడ్డి?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడే రఘురామి రెడ్డి. అంతేకాదు తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా ఈయనకు వియ్యంకుడే. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని ఆనుకొని ఉన్న మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి రఘురామి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి ఏకంగా నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఆయనకు రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది. ఆర్థికంగా ఆయన బలవంతుడే కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనవైపు మొగ్గుచూపిందట. తన సొదరుడు ప్రసాద్ రెడ్డికి కాకుంటే వియ్యంకుడు రఘురామి రెడ్డికి ఇవ్వాలంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎత్తుగడలు వేశారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పొంగులేటి కుటుంబ సభ్యులకు టికెట్‌ రాకుండా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నించినట్టు కూడా కథనాలు వెలువడ్డాయి. ఏదేమైనప్పటికీ చివరి రఘురామి రెడ్డి పేరు మాత్రం ఖరారయ్యిందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. కాగా ఏకంగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఖమ్మం సీటును ఆలస్యంగా ప్రకటించినా ఏమీ కాదనే ఉద్దేశ్యంతో పార్టీ ఈ సీటు అభ్యర్థి విషయంలో తాత్సారం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Untitled-5.jpg


రఘురామి రెడ్డి నామినేషన్ దాఖలు

ఖ‌మ్మం లోక్‌సభ స్థానం నుంచి రామ‌స‌హాయం రఘురామి రెడ్డి నామినేష‌న్ సోమవారమే దాఖలైంది. ఆయన తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన అనుచరులు మద్దినేని స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేష్ రెడ్డి, డాక్టర్ కోట రాంబాబు, రామ్మూర్తి నాయక్, ఎండీ ముస్తఫా, మలీదు జగన్, జొన్నలగడ్డ రవి, రమేశ్‌లు దాఖలు చేశారు. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అందజేశారు.

Read Latest Election News and Telugu News.

Updated Date - Apr 24 , 2024 | 12:48 PM