Share News

Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే షరియా చట్టం తెస్తారు.. యోగి తీవ్ర ఆరోపణ

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:38 PM

కాంగ్రెస్ పార్టీపై బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 'షరియా చట్టం' తెచ్చేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని చెప్పారు.

Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే షరియా చట్టం తెస్తారు.. యోగి తీవ్ర ఆరోపణ

అమ్రోహా: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 'షరియా చట్టం' (Sharia Law) తెచ్చేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని చెప్పారు. దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయడం, ప్రజల సంపద వారికే తిరిగి పంచేయడం వంటివి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉద్దేశంగా చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.

Shatrughan Sinha: నామినేషన్ వేసిన షాట్‌గన్... టీఎంసీకి సరికొత్త రికార్డులు ఖాయమని ధీమా


''కాంగ్రెస్ పార్టీ, దాని భాగస్వాములు దేశాన్ని వంచించారు. మరోసారి తప్పుడు మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను పరిశీలిస్తే, తాము అధికారంలో వస్తే షరియా చట్టాన్ని అమలు చేస్తామని వారు చెప్పినట్టు స్పష్టంగా కనిపిస్తుంది'' అని అమ్రోహాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో యోగి వ్యాఖ్యానించారు. ఒకటే తాను అడగదలచుకున్నానని, బాబా సాహెబ్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తోందా? షరియత్ ప్రకారం నడుస్తోందా? అని యోగి ప్రశ్నించారు. వేర్వేరు కమ్యూనిటీలకు వేర్వేరు చట్టాలు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ మాట్లాడుతోందని, దాని అర్థం దేశంలో షరియా చట్టం అమలు చేస్తామని స్పష్టంగా చెప్పడం కాదా? అని నిలదీశారు. త్రిపుల్ తలాఖ్‌ను మోదీ సర్కార్ రద్దు చేయడంతో షరియా చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ అనుకుంటోందని యోగి ఆక్షేపించారు. వ్యక్తిగత చట్టాలను తిరిగి తెస్తామని కాంగ్రెస్ చెబుతుండటం వెనుక వారి ఉద్దేశం చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2006లో చేసిన వ్యాఖ్యలను కూడా యోగి ప్రస్తావిస్తూ, దేశ వనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉందని అప్పట్లో మన్మోహన్ సింగ్ చెప్పారని, మరి దళితులు, వెనుకబడిన తరగతులు, పేదలు, రైతుల మాటేమిటి? మన తల్లులు, సోదరీమణులు ఎక్కడకు వెళ్లాలి? మన యువకులు ఏమై పోవాలి? అని యోగి ఆదిత్యనాథ్ వరుస ప్రశ్నలు గుప్పించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 06:46 PM