Share News

Mynampally Hanumathrao: నా టార్గెట్ గజ్వేల్, సిద్దిపేటలో ఇద్దరినీ ఇంటికి పంపుడే...

ABN , Publish Date - Apr 12 , 2024 | 03:39 PM

Telangana: బీఆరన్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌ రావుపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మామ, అల్లుళ్ళలో ఒకరిని తోటపల్లి, ఇంకొరిని చింతమడకకు పంపడం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకుంటా నర్సారెడ్డి , మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు, మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.

Mynampally Hanumathrao: నా టార్గెట్ గజ్వేల్,  సిద్దిపేటలో ఇద్దరినీ ఇంటికి పంపుడే...
Congress leader Mynampally Hanmanth Rao

సిద్దిపేట జిల్లా, ఏప్రిల్ 12: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR), మాజీ మంత్రి హరీష్‌ రావుపై (Former minister Harish Rao) కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు (Congress Leader Mynampally Hanumanth Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మామ, అల్లుళ్ళలో ఒకరిని తోటపల్లి, ఇంకొరిని చింతమడకకు పంపడం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ (Congress) నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకుంటా నర్సారెడ్డి , మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు, మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.

President Rule: ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నం.. రాష్ట్రపతి పాలన విధించేందుకు పన్నాగం


ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ... ‘‘నా టార్గెట్ గజ్వేల్, సిద్దిపేటలో ఇద్దరినీ ఇంటికి పంపుడే’’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యేలు లేకపోవడం బాధాకరమన్నారు. నాయకులు మాజీలు అవుతారు కానీ కార్యకర్తలు మాజీలు కారన్నారు. నీలం మధు వార్డు మెంబర్ నుంచి పైస్థాయికి వచ్చిన వ్యక్తి కాబట్టి కార్యకర్తల బాధ తెలుసన్నారు. బీఆర్‌ఎస్ నాయకులకు డబ్బుల తప్ప కార్యకర్తల బాధలు తెలియవని మండిపడ్డారు. నీలం మధుకు తల్లి, తండ్రి లేరు కాబట్టి మనమే తల్లిదండ్రులమన్నారు. మాటల్లో కాకుండా చేతుల్లో చేద్దామని మైనంపల్లి హనుమంతరావు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు

Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని ఆంగ్ల అక్షరాన్ని కనిపెట్టండి..!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 12 , 2024 | 04:01 PM