Share News

Delhi Liquor Scam: కవిత దందాలను బయటపెట్టిన సీబీఐ.. వామ్మో ఇలా చేశారా!?

ABN , Publish Date - Apr 12 , 2024 | 02:15 PM

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ(CBI). ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది సీబీఐ. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి(Sharath Chandra Reddy).. కవిత జాగృతి సంస్థకు ..

Delhi Liquor Scam: కవిత దందాలను బయటపెట్టిన సీబీఐ.. వామ్మో ఇలా చేశారా!?
MLC Kavitha

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ(CBI). ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది సీబీఐ. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి(Sharath Chandra Reddy).. కవిత జాగృతి సంస్థకు రూ. 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారంది.

నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ. 80లక్షలు చెల్లించారట. మహబూబ్ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను రూ.14కోట్లు ఇవ్వలేని శరత్ చంద్రారెడ్డి చెప్పారట. కానీ, రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది.

ఒక్కో రిటైల్ జోన్‌కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారట. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని సిబిఐ ఆరోపించింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కి కవితే రూ.100కోట్లు చెల్లించారని సీబీఐ తెలిపింది. అలా

ఇండో స్పిరిట్స్‌లో 65శాతం వాటా పొందారట. గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారట. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడట. ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని.. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాల్సి ఉందని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 02:15 PM