Share News

BRS: నిరీక్షణకు తెర.. వరంగల్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్..

ABN , Publish Date - Apr 12 , 2024 | 06:01 PM

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్ వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

BRS: నిరీక్షణకు తెర.. వరంగల్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్ వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నో రోజులుగా నాన్చుతున్న వరంగల్ ఎంపీ అభ్యర్థి విషయంలో పార్టీ కీలక నిర్ణయం వెల్లడించింది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ ను నియమిస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఅర్ ప్రకటించారు.


Inter Results: క్షణికావేశానికి నిండు ప్రాణం బలి.. ఇంటర్ లో ఫెయిల్.. మనస్తాపంతో..

హన్మకొండ జిల్లా మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా అధినేత తో కలిసి పని చేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు పార్టీ నేతలతో చర్చించిన అనంతరం సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు.


AP Elections: కాంగ్రెస్, వామపక్ష పార్టీల పొత్తు.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..

కాగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తొలుత కడియం కావ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసినా అనూహ్యంగా ఆమె బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో వరంగల్‌ ఓటర్లలో గట్టి పట్టున్న నేతను బరిలో దించాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కేటీఆర్‌, హరీశ్‌రావు సేకరించి ఓ నిర్ణయానికి వచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 12 , 2024 | 07:51 PM