Share News

AP Elections: కాంగ్రెస్, వామపక్ష పార్టీల పొత్తు.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..

ABN , Publish Date - Apr 12 , 2024 | 04:37 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు రాజకీయాలు కాక రేపుతున్నాయి. అధికార వైసీపీని గద్దె దించి రాక్షస పాలనను అంతమొందించాలనే లక్ష్యంతో టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు ఇప్పటికే కూటమిగా జట్టు కట్టాయి.

AP Elections:  కాంగ్రెస్, వామపక్ష పార్టీల పొత్తు.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ( Andhra Pradesh Assemlby Elections 2024 ) పొత్తు రాజకీయాలు కాక రేపుతున్నాయి. అధికార వైసీపీని గద్దె దించి రాక్షస పాలనను అంతమొందించాలనే లక్ష్యంతో టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు ఇప్పటికే కూటమిగా జట్టు కట్టాయి. ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్, వామపక్ష పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా సీపీఎం తరపున ఒక ఎంపీ, 8 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు కాంగ్రెస్ తో ఒప్పందం కుదిరింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడిన స్థితిలో వామపక్షాలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి.


AP Elections: షర్మిలపై వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..

అరకు (ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి పాచిపెంట అప్పలనర్సయ్య, రంపచోడవరం (ST) కు లోతా రామారావు, నెల్లూరు సిటీకీ మూలం రమేష్‌, కురుపాం (ఎస్టీ)కి మండంగి రమణ, గాజువాక నుంచి మరడాన జగ్గునాయుడు, విజయవాడ సెంట్రల్‌ కు చిగురుపాటి బాబురావు, గన్నవరం నుంచి కళ్లం వెంకటేశ్వరరావు, మంగళగిరికి జొన్నా శివశంకర్‌ పోటీ చేస్తుండగా పాణ్యం స్థానాన్ని పెండింగ్ లో ఉంచారు. అరకు (ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి పాచిపెంట అప్పలనర్సయ్య బరిలో ఉన్నారు.


KA Paul: ప్రజాశాంతి పార్టీ గుర్తు మారిందండోయ్.. కొత్త గుర్తు ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడేది తమ పార్టీ మాత్రమేనని ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నట్లు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తామంతా కలిసి పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్‌ జగన్‌, చంద్రబాబు ఇద్దరూ విఫలమయ్యారని ఘాటుగా విమర్శించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 12 , 2024 | 04:37 PM