Share News

KA Paul: ప్రజాశాంతి పార్టీ గుర్తు మారిందండోయ్.. కొత్త గుర్తు ఏంటంటే..

ABN , Publish Date - Apr 12 , 2024 | 02:56 PM

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) అసెంబ్లీ ఎన్నికలు మండు వేసవిలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఓ వైపు, వైసీపీ మరో వైపు తాడో పేడో తేల్చుకునేందురు రెడీ అవుతున్నాయి.

KA Paul: ప్రజాశాంతి పార్టీ గుర్తు మారిందండోయ్.. కొత్త గుర్తు ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) అసెంబ్లీ ఎన్నికలు మండు వేసవిలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఓ వైపు, వైసీపీ మరో వైపు తాడో పేడో తేల్చుకునేందురు రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్ సైతం ఉనికి చాటుకునేందుకు బలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ పార్టీలతో పాటు కేఏ పాల్ అధ్యక్షత వహిస్తున్న ప్రజాశాంతి పార్టీ సైతం అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే ఇన్నాళ్లు హెలీ కాప్టర్ గుర్తు కేటాయించిన ఈసీ తాజాగా ఆ గుర్తును మార్చేసింది. హెలీ కాఫ్టర్ గుర్తు స్థానం లో మట్టి కుండను కేటాయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివరాలు వెల్లడించారు.


Delhi Liquor Scam: కవిత దందాలను బయటపెట్టిన సీబీఐ.. వామ్మో ఇలా చేశారా!?

మట్టి కుండ గుర్తుకే ఓటు వేసి ప్రజా శాంతి పార్టీని గెలిపించాలని కేఏ పాల్ కోరారు. పార్టీ కార్యాలయం నుంచి మట్టి కుండతో అనుచరులతో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం .కేఏ పాల్ స్వయంగా మట్టి కుండ తయారు చేశారు. తనను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇతరులను గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచుకుంటారని వివరించారు. రూ.5 లక్షల కోట్లు దానం చేసిన పాల్ కావాలా లేక రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా అని ప్రశ్నించారు.


AP Politics: ‘ఉండి’ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం.. రఘురామ కోసమేనా..?

అవినీతి పరులను ఈ ఎన్నికల్లో ఓడించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. బొత్స ఝాన్సీ ఫ్యామిలీ విజయనగరాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి విశాఖ ఎంపిగా పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఆమె విశాఖ ఎంపీ అయితే తాను ప్యారిన్ మినిస్టర్ అవుతానని రాష్ట్రం దేశం మొత్తం అప్పులు తీర్చేస్తానని హామీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 12 , 2024 | 02:57 PM