Share News

MLC Election Polling: వరంగల్‌లో పోలింగ్ బూత్‌ వద్ద డబ్బుల పంపిణీ.. పోలీసులకు బీజేపీ నాయకుల ఫిర్యాదు

ABN , Publish Date - May 27 , 2024 | 12:03 PM

తెలంగాణలో వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటుచేశారు.

MLC Election Polling: వరంగల్‌లో పోలింగ్ బూత్‌ వద్ద డబ్బుల పంపిణీ.. పోలీసులకు బీజేపీ నాయకుల ఫిర్యాదు
MLC Voters (File Photo)

తెలంగాణలో వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటుచేశారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ప్రధాన నగరాల్లో ఒకటికి పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు పోటీచేస్తుండంతో ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ డబ్బులు పంచుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు హన్మకొండలోని ఓ పోలింగ్ బూత్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి పోలింగ్ బూత్ సమీపంలోని బీఆర్‌ఎస్ కార్యకర్తలను పంపించివేశారు.

Hyderabad: వేలం గ్యారెంటీ...


గెలుపు కోసం నోట్ల పంపిణీ

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బులు పంచారనే వార్తలు వచ్చాయి. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపే లక్షంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బులు పంపిణీకి తెరలేపినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ బూత్ వద్ద ఓటరు స్లిప్పుల పంపిణీ పేరుతో బీఆర్‌ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నరు.


Hyderabad: మళ్లీ కోతలు ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Telangana News and Telugu News

Updated Date - May 27 , 2024 | 12:26 PM