Share News

TS Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో మార్చి-12 బిగ్ డే..

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:35 PM

రేపు తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో బిగ్ డే కానుంది. మార్చి 12 తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఒకేరోజు రంగంలోకి అమిత్ షా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ దిగనున్నారు. రేపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటా పోటీ సభలు నిర్వహించారు. షెడ్యూల్‌కు ముందే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పార్టీలు పూరిస్తున్నాయి.

TS Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో మార్చి-12 బిగ్ డే..

హైదరాబాద్: రేపు తెలంగాణ (Telangana) స్టేట్ పాలిటిక్స్‌లో బిగ్ డే కానుంది. మార్చి 12 తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఒకేరోజు రంగంలోకి అమిత్ షా (Amit Shah), రేవంత్ రెడ్డి (Revanth reddy), కేసీఆర్ (KCR) దిగనున్నారు. రేపు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పోటా పోటీ సభలు నిర్వహించనున్నారు. షెడ్యూల్‌కు ముందే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పార్టీలు పూరిస్తున్నాయి. అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలతో సీఎం రేవంత్ స్పీడ్ పెంచారు.

BJP: మాజీ ఎంపీ చేరికతో ఆదిలాబాద్‌ బీజేపీలో కాక.. ఢిల్లీకి జిల్లా నేతలు

రేపు పరేడ్ గ్రౌండ్‌లో రేవంత్ మహిళా శక్తి సభ.. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ ముందే పథకాలను రేవంత్ లాంచ్ చేస్తున్నారు. అలాగే కరీంనగర్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కదన భేరి బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా కేసీఆర్ ప్రసంగించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ నిర్వహించనున్నారు. ఒకే రోజు మూడు ప్రధాన పార్టీల సభలతో ఆసక్తిగా తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

CM Revanth: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 11 , 2024 | 02:12 PM