Share News

Ashwin: బుమ్రాకు షాక్.. నంబర్ వన్‌గా అశ్విన్.. మళ్లీ టాప్‌ టెన్‌లోకి రోహిత్‌

ABN , Publish Date - Mar 14 , 2024 | 08:06 AM

ఇంగ్లండ్‌తో ధర్మశాల మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకున్న టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌ బౌలర్ల జాబితాలో సహచరుడు బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Ashwin: బుమ్రాకు షాక్.. నంబర్ వన్‌గా అశ్విన్.. మళ్లీ టాప్‌ టెన్‌లోకి రోహిత్‌

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో ధర్మశాల మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకున్న టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌ బౌలర్ల జాబితాలో సహచరుడు బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 870 పాయింట్లతో అగ్రపీఠాన నిలిచిన అశ్విన్‌.. టెస్టులో టాప్‌ ర్యాంక్‌ను అందుకోవడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఇక, ఇప్పటిదాకా టాప్‌గా ఉన్న బుమ్రా.. 847 పాయింట్లతో ఆసీస్‌ బౌలర్‌ హాజెల్‌వుడ్‌తో కలిసి రెండోస్థానాన్ని పంచుకున్నాడు. రబాడ 4, కమిన్స్‌ 5వ ర్యాంకులో ఉన్నారు. కుల్దీప్‌ యాదవ్‌ ఏకంగా 15 స్థానాలు మెరుగై 16వ ర్యాంక్‌లో నిలిచాడు. టీమిండియా సారథి రోహిత్‌ శర్మ బ్యాటర్ల జాబితాలో ఐదు స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌కు చేరి మళ్లీ టాప్‌టెన్‌లోకి వచ్చాడు. యశస్వీ జైస్వాల్‌ రెండుస్థానాలు మెరుగై 8వ, గిల్‌ 20వ ర్యాంకుల్లో ఉన్నారు. కేన్‌ విలియమ్సన్‌ నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్లలో జడేజా టాప్‌, అశ్విన్‌ 2వ ర్యాంక్‌లను నిలబెట్టుకోగా, అక్షర్‌ పటేల్‌ 6వ స్థానానికి పడిపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 08:06 AM