Share News

IND vs SA 2nd Test: నిప్పులు కక్కుతున్న మహ్మద్ సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా

ABN , Publish Date - Jan 03 , 2024 | 02:49 PM

సౌతాఫ్రికాతో మొదలైన రెండో టెస్టు మ్యాచ్‌ ఆరంభంలోనే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు కక్కుతున్నాడు. ఆరంభంలోనే సౌతాఫ్రికా ఓపెనర్లు ఎయిడెన్ మాక్రమ్(2), డీన్ ఎల్గర్‌(4)ను పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే టోనీ డి జోర్జి(2)ని కూడా ఔట్ చేశాడు.

IND vs SA 2nd Test: నిప్పులు కక్కుతున్న మహ్మద్ సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో మొదలైన రెండో టెస్టు మ్యాచ్‌ ఆరంభంలోనే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు కక్కుతున్నాడు. ఆరంభంలోనే సౌతాఫ్రికా ఓపెనర్లు ఎయిడెన్ మాక్రమ్(2), డీన్ ఎల్గర్‌(4)ను పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే టోనీ డి జోర్జి(2)ని కూడా ఔట్ చేశాడు. సిరాజ్‌కు బుమ్రా కూడా తోడవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన అతిథ్య జట్టు సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లోపడింది. టీమిండియా పేసర్ల దెబ్బకు సఫారీ జట్టు టాప్ 4 బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు క్యూ కట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే సిరాజ్ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ మాక్రమ్‌ను 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చిన మాక్రమ్ ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన సిరాజ్ సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ను 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.


3 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్‌ను 9వ ఓవర్లో బుమ్రా ఔట్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ అందుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే సిరాజ్ మియా మరోసారి చెలరేగడంతో 2 పరుగులే చేసిన వన్‌డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జి వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 9.2 ఓవర్లలో 15 పరుగులే చేసి టాప్ 4 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ ఇప్పటికే 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక వికెట్ తీశాడు.

తుది జట్లు

దక్షిణాఫ్రికా

డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రామ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నాండ్రే బర్గర్, లుంగీ

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్

Updated Date - Jan 03 , 2024 | 02:50 PM