Share News

T20 World Cup: అమెరికాకి వెళ్లేందుకు భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ సిద్ధం.. ఎప్పుడంటే?

ABN , Publish Date - May 25 , 2024 | 01:44 PM

ఐపీఎల్ సమరం తుది అంకానికి చేరుకోవడంతో.. భారత జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌పై దృష్టి సారించింది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా..

T20 World Cup: అమెరికాకి వెళ్లేందుకు భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ సిద్ధం.. ఎప్పుడంటే?

ఐపీఎల్ (IPL) సమరం తుది అంకానికి చేరుకోవడంతో.. భారత జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌పై (T20 World Cup) దృష్టి సారించింది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఐపీఎల్ నుంచి ప్లేయర్లందరూ ఫ్రీ అయ్యారు కాబట్టి.. భారత క్రికెటర్ల తొలి బ్యాచ్ అమెరికాకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. మే 25న (శనివారం) రాత్రి 10 గంటల సమయంలో ఈ ఆటగాళ్లు యూఎస్‌కి బయలుదేరనున్నారు.


Read Also: గుడివాడలో ‘కిలేడీ’.. అమాయకులకు మాయమాటలు చెప్పి..

నిజానికి.. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్ జూన్ 5వ తేదీన ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌తోనే ఈ మెగా టోర్నీలో టీమిండియా జర్నీ ప్రారంభమవుతుంది. అయితే.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని పట్టుదలతో ఉన్న భారత్, అందుకోసం కసరత్తులు చేసేందుకు ముందుగానే అమెరికాకు వెళ్తోంది. అక్కడి వాతావరణాన్ని, ముఖ్యంగా పిచ్ పరిస్థితిని అర్థం చేసుకోవడం కోసం.. భారత ఆటగాళ్లు ఇంకా కొన్ని రోజుల సమయం ఉండగానే యూఎస్‌కి పయనమవుతున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ టోర్నీలో రోహిత్ శర్మ సైన్యం ఎలా రాణిస్తుందన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Read Also: మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూక.. పెట్రలో పోసి, నిప్పంటించి..

భారత్ చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని 2013లో సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ కేవలం 5 పరుగుల తేడాతో గెలుపొంది, ఐసీసీ టైటిల్‌ని సొంతం చేసుకుంది. అంతే.. మళ్లీ ఆ తర్వాత ఐసీసీ టోర్నీల్లో రాణించలేదు. గత 11 ఏళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీని అందుకోవడం భారత్‌కు కత్తి మీద సాములాగా మారింది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ దాకా వెళ్లగలిగింది కానీ.. టైటిల్ మాత్రం నెగ్గలేకపోయింది. అందుకే.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని రోహిత్ శర్మ సేన కసి మీద ఉంది. 11 ఏళ్ల నుంచి అందని ద్రాక్షలాగా మారిన ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తోంది.

Read Also: భార్యకు హార్దిక్ విడాకులు.. నటాషాకు ఆస్తిలో 70% వాటా?


భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్

రిజర్వ్ కోటా: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

Read Latest Sports News and Telugu News

Updated Date - May 25 , 2024 | 01:44 PM