Share News

Hardik Pandya: భార్యకు హార్దిక్ విడాకులు.. ఆస్తిలో నటాషాకు 70% వాటా?

ABN , Publish Date - May 25 , 2024 | 12:57 PM

తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన..

Hardik Pandya: భార్యకు హార్దిక్ విడాకులు.. ఆస్తిలో నటాషాకు 70% వాటా?

తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు (Natasa Stankovic) టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) విడాకులు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంతవరకూ రాలేదు కానీ, పాండ్యా దంపతులు విడిపోతున్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకి (Family Court) వెళ్లారని వార్తలొస్తున్నాయి. అంతేకాదు.. విడాకుల తర్వాత భరణం (Alimony) కింద నటాషాకు హార్దిక్ తన ఆస్తిలో 70 శాతం వాటా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.


విడాకులకు కారణం

హార్దిక్, నటాషా విడాకులు తీసుకోవడానికి సరైన కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు కానీ.. అభిప్రాయ బేధాలతోనే వీళ్లిద్దరు విడిపోవాలని కలిసి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తమ మధ్య ఉన్న ఈ విభేదాల కారణంగానే.. వీళ్లు చాలాకాలం నుంచి కలిసి కనిపించడం లేదు. చివరిసారిగా ఫిబ్రవరి 14న వీళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫోటోని షేర్ చేశారు. అప్పటి నుంచి వీళ్లు మళ్లీ ఎలాంటి పోస్టులు షేర్ చేయలేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగానూ నటాషా ఎక్కడా కనిపించలేదు. పాండ్యాపై తారాస్థాయిలో విమర్శలు వచ్చినా స్పందించలేదు. పైగా.. నటాషా తన పేరులో నుంచి ‘పాండ్యా’ను కూడా తొలగించింది. ఈ పరిణామాలే.. వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చాయి.

హార్దిక్ పాండ్యా ఆస్తులు

ఇదిలావుండగా.. హార్దిక్ పాండ్యాకు వడోదర, ముంబై ప్రాంతాల్లో చాలా ఆస్తులున్నాయి. ముంబైలో అతను రూ.30 కోట్లు పెట్టి ఒక అపార్ట్‌మెంట్‌ని తీసుకున్నాడు. వడోదరలో తీసుకున్న పెంట్ హౌస్ ఖరీదు కూడా కోట్లలోనే ఉంది. ఇక ఐపీఎల్‌లో అయితే ముంబై జట్టు నుంచి అతడు రూ.15 కోట్లు ఫీజుగా తీసుకుంటాడు. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు కూడా అంతే అమౌంట్ అందుకున్నాడు. దీనికితోడు.. భారత జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నందకూ పాండ్యాకు కోట్లలోనే ఆదాయం అందుతుంది. కొన్ని బ్రాండ్‌లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. అయితే.. విడాకుల కారణంగా 70 శాతం వాటా ఇవ్వాలి కాబట్టి, ఆర్థికంగా అతనికి గట్టి దెబ్బే తగలొచ్చు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 25 , 2024 | 02:02 PM