Share News

Lok Sabha Polls 2024: ఓటరు జాబితాలో లేని జైశంకర్ పేరు.. తీరా చూస్తే..

ABN , Publish Date - May 25 , 2024 | 12:02 PM

లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ శనివారం జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే..

Lok Sabha Polls 2024: ఓటరు జాబితాలో లేని జైశంకర్ పేరు.. తీరా చూస్తే..

లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ (Lok Sabha Elections 6th Phase Polling) శనివారం జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్స్‌కి తరలి వెళ్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) కూడా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఆయన క్యూలో నిలబడ్డారు కూడా! కానీ.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఓటరు జాబితాలో ఆయన పేరు లేదని తేలింది.


Read Also: విషాదాంతంగా మారిన వరంగల్ ‘లవ్ స్టోరీ’.. అసలు ఏమైందంటే?

దీంతో ఖంగుతిన్న జైశంకర్.. మరోసారి ఆ జాబితాను చెక్ చేశారు. చివరికి తన పేరు లేదని కన్ఫమ్ చేసుకున్న ఆయన.. ఓటు వేయకుండా ఇంటికి చేరుకున్నారు. ఇంటికెళ్లిన తర్వాత జాబితాలో తన పేరు ఎందుకు లేదని మరోసారి తనిఖీ చేశారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన ఓటింగ్ కేంద్రం మరో ప్రాంతంలో ఉందని తెలుసుకున్నారు. దీంతో.. ఆ పోలింగ్ బూత్‌కి వెంటనే వెళ్లి, తన ఓటు వేశారు. ఇక్కడే మరో ఆసక్తికర పరిణామం తెరమీదకు వచ్చింది. ఆ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు తానే కావడంతో.. అధికారులు ఆయనకు ఓ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకుంటూ.. ఆ సర్టిఫికెట్‌ను చూపించారు.

Read Also: మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూక.. పెట్రలో పోసి, నిప్పంటించి..

ఇదే సమయంలో.. రికార్డ్ స్థాయిలో ఓటు వేయాలని ఓటర్లకు జైశంకర్ విజ్ఞప్తి చేశారు. న్యూ ఢిల్లీలో తాను తన ఓటు హక్కుని వినియోగించుకున్నానని, ఇతర ఓటర్లు సైతం ఈ ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో రికార్డ్ సంఖ్యలో ఓటు వేయాలని కోరుతున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అలాగే ఓటు వేసిన అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. ‘‘భారతదేశానికి ఇదొక నిర్ణయాత్మక తరుణం కాబట్టి.. ప్రజలందరూ బయటకొచ్చి ఓటు వేయాలని కోరుతున్నాను’’ అని అన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 25 , 2024 | 12:02 PM