Share News

Elections 2024: మైదానంలో బ్యాటర్లను వణికించాడు.. ఇక రాజకీయాల్లో ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేస్తాడా..

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:56 PM

ప్రస్తుతం భారత క్రికెట్‌లో, జాతీయ రాజకీయాల్లో కామన్‌గా వినిపిస్తోన్న పేరు మహ్మద్ షమీ. టీమిండియాలో పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న షమీ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి అందరికి దగ్గరయ్యాడు.

Elections 2024: మైదానంలో బ్యాటర్లను వణికించాడు.. ఇక రాజకీయాల్లో ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేస్తాడా..

ప్రస్తుతం భారత క్రికెట్‌లో, జాతీయ రాజకీయాల్లో కామన్‌గా వినిపిస్తోన్న పేరు మహ్మద్ షమీ. టీమిండియాలో పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న షమీ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి అందరికి దగ్గరయ్యాడు. వరల్డ్ కప్‌లో షమీ ప్రదర్శనకు క్రికెట్ అభిమానులే కాకుండా రాజకీయ నాయకులు సైతం ఫిదా అయిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం షమీని స్వయంగా అభినందించారు. సాధారణంగా క్రికెట్ మైదానంలో తన పేస్‌తో, బౌన్సర్లతో, యార్కర్లతో బ్యాటర్లను షమీ ఔట్ చేస్తుంటాడు. షమీని ఎదుర్కొలేక బ్యాటర్లు బెంబెలెత్తిపోతుంటారు. కీలక సమయంలో వికెట్లు తీసి షమీ జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి తప్పదనుకున్న సమయంలో చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. షమీకి కాస్త పిచ్ అనుకూలించిందంటే అతడిని ఆపడం చాలా కష్టం. పిచ్ అనుకూలించే సమయంలో షమీ చేతికి బంతి ఇవ్వడమంటే లడ్డు స్వయంగా తీసువకొచ్చి చేతిలో పెట్టినట్టే. ఆ సమయంలో షమీ నుంచి వచ్చే బంతులను ఎదుర్కొలేక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతుంటారు.


అయితే తాజాగా షమీ విషయంలో రాజకీయాల్లోనూ అచ్చం ఇలాంటి సంఘటనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం.. ప్రస్తుతం బీజేపీ మూడో సారి అధికారం చేపట్టడానికి దేశ వ్యాప్తంగా అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో షమీకి బీజేపీ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో షమీ నిజంగానే ఎన్నికల బరిలోకి దిగితే బీజేపీకి ఉన్న అనుకూలత, షమీ ఫాలోయింగ్‌తో గెలిచే అవకాశాలే ఎక్కువ. తన బౌన్సర్లు, యార్కర్లతో మైదానంలో బ్యాటర్లను బోల్తా కొట్టించినట్టుగా.. రాజకీయాల్లోనూ ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేసే అవకాశాలున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో సత్తా చాటాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంటే మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని పట్టుదలగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా టీమిండియా స్టార్ బౌలర్ షమీని బెంగాల్‌లో పోటీలో నిలపాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల రగడ నెలకొన్న సందేశ్ ఖాలి పరిధిలో గల బరిషిత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి షమీకి టికెట్ ఆఫర్ చేసినట్టు సమాచారం. అక్కడ ముస్లిం మైనారిటీ వర్గం ఎక్కువగా ఉండడంతో షమీ గెలుస్తాడని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం బరిషిత్ లోక్‌సభకు అధికార టీఎంసీ నేత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే షమీ పోటీపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఇంతవరకు షమీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక వేళ ఈ వార్తలు నిజమే అయితే రాజకీయాల్లో షమీ ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తన బౌన్సర్లు, యార్కర్లతో మైదానంలో బ్యాటర్లను బోల్తా కొట్టించినట్టుగా.. రాజకీయాల్లోనూ ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేస్తాడేమో చూడాలి. దీంతో షమీ బౌన్సర్లను, యార్కర్లను ఎదుర్కొవడానికి ప్రత్యర్థులు కూడా సిద్ధంగా ఉండడం మంచింది. లేదంటే షమీ చేతిలో క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిన పరిస్థితులు రావొచ్చు. రాజకీయ మైదానంలో షమీ ఆడే ఆట ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మోదీతో సాన్నిహిత్యం..?

ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో షమీ ఇరగదీశాడు. బాల్‌తో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఫైనల్‌లో మ్యాచ్ ఓడిన తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ వద్దకు ప్రధాని మోదీ వచ్చారు. టీమిండియా సభ్యులను ఓదార్చారు. ఆ సమయంలో షమీని ప్రత్యేకంగా అభినందించారు. చాలా చక్కగా ఆడావని మరీ మరీ మెచ్చుకున్నారు. షమీని కౌగిలించుకున్నారు కూడా. ఆ తర్వాత మహ్మద్ షమీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో బీజేపీలో చేరడమో.. లేదంటే ప్రచారం చేస్తారని భావించారు. అనూహ్యంగా లోక్ సభ బరిలో నిలుపుతామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు.

బెంగాల్‌తో అనుబంధం

మహ్మద్ షమీకి బెంగాల్‌తో అనుబంధం ఉంది. బెంగాల్ తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడతారు. అలా అతడిని బెంగాల్ నుంచి పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోంది. షమీని లోక్ సభ నుంచి బరిలోకి దింపుతారనే ఊహాగానాలు నెలకొనగా.. షమీ స్వగ్రామం అమ్రోహలో స్టేడియం నిర్మిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదత్యనాథ్ ప్రకటన చేశారు. షమీకి ఇటీవల శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇంతలో లోక్ సభ బరిలో దింపుతామని బీజేపీ అంటోంది. దీనిపై షమీ స్పందించాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IND vs ENG: క్రిస్ గేల్, జో రూట్ రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్.. ద్రావిడ్‌తో సమంగా..

IND vs ENG: సెంచరీలతో రోహిత్, గిల్ విధ్వంసం.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా



Updated Date - Mar 08 , 2024 | 02:28 PM