Share News

IPL 2024: లీగ్ దశలో వైదొలిగిన ఛాంపియన్ టీమ్స్..!!

ABN , Publish Date - May 19 , 2024 | 10:22 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 రసవత్తరంగా సాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నాలుగు జట్లు ప్లై ఆప్స్ చేరాయి. నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టుపై బెంగళూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

IPL 2024: లీగ్ దశలో వైదొలిగిన ఛాంపియన్ టీమ్స్..!!
CSK And MI

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 రసవత్తరంగా సాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నాలుగు జట్లు ప్లై ఆప్స్ చేరాయి. నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టుపై బెంగళూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఐదేసి సార్లు కప్పులు కొట్టిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ సారి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. ఆ జట్ల అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.


చెన్నై జట్టు ఇలా..

ఐపీఎల్‌లో చెన్నై జట్టు ఇప్పటికే ఐదుసార్లు టైటిళ్లు గెలిచింది. 2010లో ఫస్ట్ టైం ముంబై జట్టుపై 22 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. 2011లో కూడా సీఎస్కే జట్టు విజయం సాధించింది. 2012లో కూడా సీఎస్కే ఫైనల్ చేరింది. కోల్ కతా చేతిలో ఓడిపోయింది. 2018లో సన్ రైజర్స్ జట్టుపై, 2021లో కోల్ కతాపై, 2023లో గుజరాత్‌పై జట్టుపై గెలిచింది. ఇలా వరసగా ఐదుసార్లు కప్పు గెలిచింది. 2013, 2015, 2019లో కూడా ఫైనల్ చేరింది. మూడుసార్లు ముంబై చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఈ సారి మాత్రం లీగ్ దశలోనే ఓడిపోయి ఇంటికి వచ్చేసింది. ఆ జట్టులో మహేంద్ర సింగ్ ధోని వచ్చే సీజన్ ఆడకపోవచ్చు. ఈ సారి కప్పు గెలిచి ఘనంగా వీడ్కోలు పలకాలని టీమ్ మెంబర్స్ భావించారు. వారి కోరిక ఫలించలేదు.


ముంబై జట్టు ఇలా..

ఐపీఎల్‌లో ముంబై జట్టు కూడా ఐదుసార్లు కప్పును గెలిచింది. 2010లో ఫైనల్ చేరినప్పటికీ చెన్నై చేతిలో ఓడిపోయింది. 2013 ఫైనల్ మ్యాచ్‌లో అదే సీఎస్కేను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. 2015లో కూడా చెన్నై జట్టును ముంబై ఓడించింది. 2017లో పుణె జట్టును, 2019లో మళ్లీ సీఎస్కేను ఓడించింది. ఆ సమయంలో చెన్నై జట్టుపై ఒక పరుగు తేడాతో గెలిచింది. 2020లో ఢిల్లీ జట్టును ముంబై మట్టికరిపించింది. ఇలా ఐదుసార్లు ముంబై జట్టు కప్పు గెలిచింది. ఈ సారి మాత్రం లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. దాని కన్నా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలువడం ఆ జట్టుకు ఉన్న క్రేజీని భారీగా తగ్గించింది.


కారణమిదే..?

ముంబై జట్టుపై ఈ సారి ఓటమికి గల కారణం కెప్టెన్సీని మార్చడమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జట్టును ముందుండి నడిపించిన రోహిత్ శర్మను కాదని హార్థిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం అని విశ్లేషిస్తారు. రోహిత్ శర్మ నేతృత్వంలో ఆడితే మరోలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారు. హార్థిక్ పాండ్యాపై భారీగా ట్రోల్స్ చేశారు. ఇది ఐపీఎల్ 17వ సీజన్. ఇందులో ముంబై, చెన్నై కలిసి 10 సార్లు కప్పు గెలిచాయి. ఆరుసార్లు మాత్రం మిగతా జట్లు గెలుపొందాయి. ఈ సీజన్‌లో ఏ జట్టు విజయతీరాలకు చేరనుందో చూడాలి. ఇందులో ఆర్సీబీ తప్ప మిగతా జట్టు టైటిల్ గెలిచాయి.



Read Latest
Sports News and Telugu News

Updated Date - May 19 , 2024 | 10:22 AM