Share News

IPL: నటి తమన్నాకు సమన్లు.. ఎందుకంటే..?

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:53 PM

మిల్కీ బ్యూటీ తమన్నాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. 2023 ఐపీఎల్‌కు సంబంధించి మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్‌లో ప్రదర్శించారు. ఆ యాప్ మహదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్ ప్రసారం చేసేందుకు హక్కు లేదు.

IPL: నటి తమన్నాకు సమన్లు.. ఎందుకంటే..?
Tamannaah Bhatia

మిల్కీ బ్యూటీ తమన్నాకు (Tamannaah Bhatia) పోలీసులు సమన్లు జారీ చేశారు. 2023 ఐపీఎల్‌కు సంబంధించి మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్‌లో ప్రదర్శించారు. ఆ యాప్ మహదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్ ప్రసారం చేసేందుకు హక్కు లేదు. గత ఏడాది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మ్యాచ్‌లు ప్రసారం చేశారు. ఆ యాప్‌లో చూడాలని బాలీవుడ్ నటులు, గాయకులు ప్రచారం చేశారు. అలా కోరిన వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా ఉన్నారు. ఆ కేసులో విచారణకు హాజరు కావాలని తమన్నాకు ముంబై సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.

Chennai Super Kings: ధోనీకేమో అలా.. రుతురాజ్‌కి ఇలా.. ఇదెక్కడి న్యాయం?


ఈడీ కేసు

మహదేవ్ బెట్టింగ్ యాప్ ఆన్ లైన్ బెట్టింగ్ ముసుగులో మనీ లాండరింగ్ కార్యకలాపాలు నిర్వహించిందని ఈడీ గుర్తించింది. మహదేవ్ కంపెనీపై కేసు కూడా ఫైల్ చేసింది. ఫెయిర్ ప్లే యాప్‌లో మ్యాచ్‌లు చూడాలని తమన్నాతోపాటు బాలీవుడ్ గాయకుడు బాద్ షా, నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్, సంజయ్ దత్ కూడా కోరారు. వారందరికీ ఇదివరకే సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. సంజయ్ దత్ మేనేజర్‌ను ముంబై సైబర్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో సంజయ్ దత్ ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆ సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని సంజయ్ దత్ లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీ కేటాయించాలని కోరారు.


రూ.కోట్లలో నష్టం

ఫెయిర్ ప్లే యాప్‌లో ఐపీఎల్ 2023 కొన్ని మ్యాచ్‌లు ప్రసారం అయ్యాయి. దీంతో వయాకామ్ మీడియా రూ.కోట్లలో నష్టపోయింది. ఇదే అంశాన్ని సంస్థ ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రసారం చేసిన ప్రముఖులకు సమన్లు జారీచేస్తున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు సమన్లు ఇష్యూ చేశారు.

Chennai Super Kings: ధోనీకేమో అలా.. రుతురాజ్‌కి ఇలా.. ఇదెక్కడి న్యాయం?


Read Latest
Sports News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 05:53 PM