Share News

Viral video: వామ్మో..! ఇదేం విచిత్రం.. బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తికి షాకింగ్ సీన్.. కమోడ్‌ నుంచి ఏకంగా..

ABN , Publish Date - May 04 , 2024 | 07:21 PM

ఇళ్ల వరండాలు, సోఫాలు, కుర్చీలు, మంచాలతో పాటూ ఆఖరికి సీలింగ్ ఫ్యాన్‌లపై కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఊహించని ప్రదేశాల నుంచి అనూహ్యంగా ఏవేవో జీవులు బయటికి రావడం చూస్తుంటాం. ఇలాంటి..

Viral video: వామ్మో..! ఇదేం విచిత్రం.. బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తికి షాకింగ్ సీన్.. కమోడ్‌ నుంచి ఏకంగా..

ఇళ్ల వరండాలు, సోఫాలు, కుర్చీలు, మంచాలతో పాటూ ఆఖరికి సీలింగ్ ఫ్యాన్‌లపై కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఊహించని ప్రదేశాల నుంచి అనూహ్యంగా ఏవేవో జీవులు బయటికి రావడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తికి షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో..! ఇదేం విచిత్రం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో (Maharashtra) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. మరుగుదొడ్డిలోకి వెళ్లిన వ్యక్తి తీరా కమోడ్ వద్దకు వెళ్లగానే అతడికి అందులో ఏదో కదుతులున్నట్లు అనుమానం కలిగింది. దీంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. కాసేపటికి కమోడ్ లోపలి నుంచి (snake came out from bathroom commode) సుమారు 10 అడుగల పొడవున్న పాము బయటికి వచ్చింది. ముందు తల బయటికి పెట్టిన పాము.. తర్వాత మెల్ల మెల్లగా బయటికి వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

Viral video: చిన్నారిని చూసి ఆనంద్ మహీంద్రా ఫిదా.. అందరిలో ఇలాంటి సంస్కారం ఉంటే..


స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందిచండతో కాసేపటికి ఓ యువతి అక్కడికి చేరుకుంది. ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్న యువతి.. దాన్ని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి అందరికీ చూపించింది. అది ఇండియన్ రాట్ స్నేక్ అని, విషపూరితం కాదని సదరు యువతి పేర్కొంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! బాత్రూంలో ఇలాక్కూడా జరుగుతుందా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: పక్కనే ఉండి షాక్ ఇచ్చిన వధువు.. మొఖం చూడాలని వరుడు ముసుగు తీయడంతో.. చివరకు..

Updated Date - May 04 , 2024 | 07:21 PM