Share News

Viral video: బంగారు నగల మూటతో పారిపోతున్న దొంగలు.. అడ్డుకున్న పోలీసు.. సినిమా సీన్‌ను తలదన్నేలా..

ABN , Publish Date - Jun 11 , 2024 | 07:44 PM

కొన్నిసార్లు సినిమా తరహా ఘటనలు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను మించిన ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు సినిమా హీరోల్లా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ అందరి మన్ననలూ పొందుతుంటారు. ఇలాంటి...

Viral video: బంగారు నగల మూటతో పారిపోతున్న దొంగలు.. అడ్డుకున్న పోలీసు.. సినిమా సీన్‌ను తలదన్నేలా..

కొన్నిసార్లు సినిమా తరహా ఘటనలు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను మించిన ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు సినిమా హీరోల్లా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ అందరి మన్ననలూ పొందుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పశ్చిమబెంగాల్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొందరు దొంగలు పట్టపగలు నగల దుకాణంలోకి చొరబడి కోట్ల రూపాయల విలువ జేసే బంగారు నగలను ఎత్తుకెళ్లాలని చూశారు. వారిని ఒకే ఒక్క పోలీసు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) రాణిగంజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నగల దుకాణంలోకి ఆదివారం మధ్యాహ్న సమయంలో ఏడుగురు ముసుగులు ధరించిన దొంగలు (Thieves) చొరబడ్డారు. దుకాణంలోని సిబ్బందికి తుపాకీలు చూపించి బెదిరించారు. తర్వాత మొత్తం రూ.4కోట్ల రూపాయల విలువైన నగలను (Gold jewelry) సంచుల్లో వేసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న మోండల్ అనే సబ్-ఇన్‌స్పెక్టర్.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

Viral video: నీటిలో తేలియాడుతున్న శవం.. బయటికి తీయాలని వెళ్లిన పోలీసులు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


పోలీసు పైకి దొంగలు కాల్పులు (firing) జరిపారు. అయినా సబ్-ఇన్‌స్పెక్టర్ ఏమాత్రం భయపడకుండా సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం చాటుగా నిలబడి ఎదురుకాల్పులు చేశాడు. ఈ క్రమంలో పోలీసుకు, దొంగలకు మధ్య చాలా సేపు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చుట్టు పక్కల ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసు కాల్పల్లో ఓ దొంగ గాయపడ్డాడు. దీంతో చివరు దొంగలు అతన్ని బైకు ఎక్కించుకుని అక్కడి నుంచి పారిపోయారు. సుమారు రూ.1.8 కోట్ల విలువైన ఆభరణాలతో పారిపోయారు. అయితే దొంగలు కంగారులో ఓ బైకును, రూ.2.5కోట్ల విలువైన ఆభరణాలు, బుల్లెట్లను అక్కడే వదిలివెళ్లారు.

Viral video: చిరుతనే బురిడీ కొట్టించిన కుక్క.. ప్రాణాలు పోయే సమయంలో ఎలాంటి ప్లాన్ వేసిందో చూస్తే..


దొంగలను వెంబడించిన సబ్-ఇన్‌స్పెక్టర్ మోండల్.. అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేశారు. ఈ క్రమంలో దొంగలు ఓ కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి వాహనాన్ని ఎత్తుకెళ్లారు. వారి కాల్పుల్లో గాయపడ్డ కారు డ్రైవర్, మరో పాదచారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బీహార్‌లోని సివాన్‌లో పోలీసులు ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నామని, త్వరలో మిగతా దొంగలను కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral video: ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే.. పడగ విప్పిన పాముకు ముద్దులు పెట్టిన కుక్కపిల్ల.. చివరకు..

Updated Date - Jun 11 , 2024 | 07:44 PM