Share News

Viral video: ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే.. పడగ విప్పిన పాముకు ముద్దులు పెట్టిన కుక్కపిల్ల.. చివరకు..

ABN , Publish Date - Jun 11 , 2024 | 06:46 PM

తమ మానాన తాము వెళ్లే పాములు.. ఎవరైనా కెలికితే మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. ఎలాంటి జంతువునైనా ఒక్క కొటుతో నేల కూలుస్తుంటాయి. అయితే ఇదే పాములు మరికొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ...

Viral video: ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే.. పడగ విప్పిన పాముకు ముద్దులు పెట్టిన కుక్కపిల్ల.. చివరకు..

తమ మానాన తాము వెళ్లే పాములు.. ఎవరైనా కెలికితే మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. ఎలాంటి జంతువునైనా ఒక్క కొటుతో నేల కూలుస్తుంటాయి. అయితే ఇదే పాములు మరికొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పడగ విప్పిన పాముల వద్దకు వచ్చిన కుక్ పిల్ల.. వాటికి ముద్దులు పెట్టింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్లున్న రెండు పెద్ద నాగు పాములకు ఓ కుక్కపిల్ల (puppy) ఎదురుగా వస్తుంది. కుక్క పిల్ల సమీపానికి రాగానే పాములు బుసలు కొడుతూ భయపెడతాయి. అయితే కుక్క పిల్ల మాత్రం ఏమాత్రం భయపడకుండా పాముల (snakes) వద్దకు వస్తుంది. అంతటితో ఆగకుండా పడగ విప్పిన పాముకు ముద్దులు పెడుతూ వాసన చూస్తుంది. అయినా పాము మాత్రం దానికి ఎలాంటి హానీ చేయదు. ఇలా చాలా సేపు కుక్క పిల్ల పాముకు ముద్దులు పెడుతూ ఉంటుంది.

Viral video: నీటిలో తేలియాడుతున్న శవం.. బయటికి తీయాలని వెళ్లిన పోలీసులు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


అయినా ఆ పాములు మాత్రం అలాగే పడగ విప్పి ఉంటాయే గానీ.. కుక్క పిల్లను మాత్రం ఏమీ అనవు. వాటి నిర్వాకం చూస్తే కుక్క పిల్లతో స్నేహం చేస్తున్నట్లుగా ఉంటుంది. పాముకు ముద్దులు పెట్టిన కుక్క పిల్ల తర్వాత అక్కడి నుంచి తాపీగా పక్కకు వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇవి మంచి స్నేహితుల్లా ఉన్నాయే’’.. అంటూ కొందరు, ‘‘ఈ పాములకు కుక్క పిల్ల బాగా నచ్చినట్లుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 36 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: చిరుతనే బురుడీ కొట్టించిన కుక్క.. ప్రాణాలు పోయే సమయంలో ఎలాంటి ప్లాన్ వేసిందో చూస్తే..

Updated Date - Jun 11 , 2024 | 06:46 PM