Share News

Viral video: చిరుతనే బురిడీ కొట్టించిన కుక్క.. ప్రాణాలు పోయే సమయంలో ఎలాంటి ప్లాన్ వేసిందో చూస్తే..

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:19 PM

సహనం, ఓపికతో పాటూ కాస్త తెలివిగా ఆలోచిస్తే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం దొరుకుతుంటుంది. కొందరు తమ తెలివితేటలతో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా ఎంతో సులభంగా బయటపడుతుంటారు. ఇలా...

Viral video: చిరుతనే బురిడీ కొట్టించిన కుక్క.. ప్రాణాలు పోయే సమయంలో ఎలాంటి ప్లాన్ వేసిందో చూస్తే..

సహనం, ఓపికతో పాటూ కాస్త తెలివిగా ఆలోచిస్తే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం దొరుకుతుంటుంది. కొందరు తమ తెలివితేటలతో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా ఎంతో సులభంగా బయటపడుతుంటారు. ఇలా చేసేది కేవలం మనుషులే అనుకుంటే పొరపాటే.. కొన్ని జంతువులు కూడా ఎంతో తెలివిగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క చిరుత పులినే బురిడీ కొట్టించింది. ప్రాణాలు పోయే సమయంలో తెలివిగా ఆలోచించి, ఎలా తప్పించుకుందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుత పులి (leopard) ఆహార వేటలో భాగంగా చివరకు ఓ కుక్కను టార్గె్ట్ చేస్తుంది. చిరుత వేటకు దాదాపు తిరుగు ఉండదు కాబట్టి.. కుక్కను ఇలా చూడగానే, అలా పట్టేసుకుంది. అయితే చెట్టుపైకి తీసుకెళ్లి తీరిగ్గా తిందామని అనుకుంది. అనుకున్నట్లుగా కుక్కను (dog) నోట కరుచుకుని ఓ చెట్టు పైకి ఎక్కింది. కొమ్మపై కుక్కను పడుకోబెట్టి కాసేపు ఆగింది. మెడను ఇలా వదలగానే కుక్క ఊపిరి తీసుకుంది.

Viral video: ఎంత వేడిగా ఉంటే మాత్రం బైకుపై ఇవేం ఏర్పాట్లురా బాబూ.. ఇలా ఎవరైనా చేస్తారా..


ఈ క్రమంలో కుక్క తప్పించుకోవాలని ప్రయత్నించినా.. సాధ్యం కాకపోవడంతో అలాగే పడుకుని ఉండిపోయింది. చిరుత పులి మధ్య మధ్యలో కుక్క మెడ పట్టుకుని కొరికే ప్రయత్నం చేసింది. అయితే మళ్లీ కాసేపు గ్యాప్ తీసుకోవాలని అనుకుని అటూ ఇటూ చూస్తూ ఉండిపోయింది. ఈ తర్వాత కుక్కను మరో కొమ్మపైకి తీసుకెళ్లి తినేయాలని అనుకుంటుంది. నోటితో పట్టుకుని కొంచెం దూరం తీసుకెళ్తుంది. అయితే మధ్యలో కొద్ది సేపు వదులుతుంది.

Viral video: కూర ఉడుకుతుండగా ఖాళీ అయిన సిలిండర్.. చిన్న ట్రిక్‌తో వంట ఎలా పూర్తిచేశాడంటే..


చిరుత పులి ఇలా కొంచెం వదలగానే అదును కోసం వేచి చూస్తున్న కుక్క.. పులి ఇలా నోటిని తెరవగానే పైనుంచి ఒక్కసారిగా దూకేసి అత్యంత వేగంతో అక్కడి నుంచి పారిపోయింది.ఈ ఘటనను వాహనాల్లో ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క చాలా స్మార్ట్ గురూ’’.. అంటూ కొందరు, ‘‘ఆపదలోనూ ఎంతో తెలివిగా ఆలోచించింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: నీటిలో తేలియాడుతున్న శవం.. బయటికి తీయాలని వెళ్లిన పోలీసులు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Updated Date - Jun 11 , 2024 | 06:46 PM