Share News

Viral Video: యువతి రావడం చూసి లిఫ్ట్ ఆపాలని ప్రయత్నించిన వ్యక్తి.. చేయి బయటికి పెట్టగానే షాకింగ్ సీన్.. చివరకు..

ABN , Publish Date - Mar 24 , 2024 | 08:40 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో తిమ్మిని బమ్మి చేయడం.. బమ్మిని తిమ్మి చేయడం చిటేకేసినంత ఈజీ. కొందరి తెలివితేటలు చూస్తే అరే..! ఇలా చేయడం సాధ్యమేనా... అని అనిపిస్తుంటుంది. మరికొందరు వివిధ రకాల ట్రిక్స్‌ ఉపయోగించి అందరినీ నమ్మిస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: యువతి రావడం చూసి లిఫ్ట్ ఆపాలని ప్రయత్నించిన వ్యక్తి.. చేయి బయటికి పెట్టగానే షాకింగ్ సీన్.. చివరకు..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో తిమ్మిని బమ్మి చేయడం.. బమ్మిని తిమ్మి చేయడం చిటేకేసినంత ఈజీ. కొందరి తెలివితేటలు చూస్తే అరే..! ఇలా చేయడం సాధ్యమేనా... అని అనిపిస్తుంటుంది. మరికొందరు వివిధ రకాల ట్రిక్స్‌ ఉపయోగించి అందరినీ నమ్మిస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. లిఫ్ట్ ఎక్కిన వ్యక్తి.. అదే సమయంలో యువతి రావడం చూసి ఆపేందుకు చేయి బయటికి పెట్టాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద భవనంలో పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కేస్తాడు. లిఫ్ట్ రూంలోకి వెళ్లగానే.. బయటి నుంచి ఓ యువతి అదే లిఫ్ట్ ఎక్కేందుకు వస్తుంటుంది. అంతలో డోర్లు మూసుకుపోవడం చూసి.. లిఫ్ట్ తెరవాలంటూ రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో లోపల ఉన్న వ్యక్తి డోర్లు తెరిచేందుకు మధ్యలో చేయి బయటికి పెడతాడు. అయితే అప్పటికే డోర్లు మూసుకుపోవడంతో చివరకు అతడి చేయి కట్ అయి కింద పడిపోతుంది. దీన్ని చూసి అక్కడున్న యువతి షాక్ అవుతుంది. కేకలు పెడుతూ అటూ ఇటూ పరుగెడుతూ కంగారుపడుతుంది.

Viral Video: స్కూటీపై వెళ్తున్న యువకుడిపై అందరికీ అనుమానం.. సమీపానికి వెళ్లి చూడగా.. ఏకంగా ల్యాప్‌టాప్‌లో..

ఆమె కేకలు విని పక్కన ఉన్న వాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి.. అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతాడు. అయితే ఈ సీన్‌ని బాగా గమనిస్తే.. ఇదంతా వాళ్లు కావాలని చేసినట్లు తెలిసిపోతుంది. ప్లాస్టిక్ చేయితో ఇలా ప్రాంక్ చేసినట్లు అర్థమైపోతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చేయి తెగిపోతే ఒక్క రక్తం చుక్క కూడా కనపడలేదు కాబట్టి.. ఇదంతా ప్రాంక్ అని తెలిసిపోయింది’’.. అంటూ కొందరు, ‘‘బాగానే కవర్ చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: టైర్లు కొత్తగా కనిపిస్తున్నాయని కొనేస్తున్నారా.. వీళ్ల తెలివితేటలు చూస్తే మతిపోవాల్సిందే..

Updated Date - Mar 27 , 2024 | 12:49 PM