Share News

Viral Video: సహచరుడిని కాపాడుకునే క్రమంలో పాముతో బల్లి ఫైట్.. చివరకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Mar 26 , 2024 | 05:49 PM

ఓ పాము ఆహారం కోసం వెతుకుతుండగా.. దానికి గోడ పైన ఓ బల్లి కంటపడింది. వెంటనే దానిపై దాడి చేసింది. బల్లిని మొత్తం చుట్టేసుకుని పక్కకు తీసుకెళ్లే క్రమంలో మరో బల్లి గమనిస్తుంది. తన స్నేహితుడిని కాపాడుకునేందుకు...

Viral Video: సహచరుడిని కాపాడుకునే క్రమంలో పాముతో బల్లి ఫైట్.. చివరకు ఏమైందో చూడండి..

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో పాములకు సంబంధించిన వీడియోలు కొన్ని నెటిజన్లను షాక్‌కి గురి చేస్తుంటారు. వివిధ జీవులపై పాములు దాడికి దిగడం చూస్తుంటాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సహచరుడిని కాపాడే ప్రయత్నంలో ఓ బల్లి తలపడింది. చివరకు ఏమైందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము ఆహారం కోసం వెతుకుతుండగా.. దానికి గోడ పైన ఓ బల్లి కంటపడింది. వెంటనే దానిపై దాడి చేసింది. బల్లిని మొత్తం చుట్టేసుకుని పక్కకు తీసుకెళ్లే క్రమంలో మరో బల్లి గమనిస్తుంది. తన స్నేహితుడిని కాపాడుకునేందుకు (lizard attacked a snake) పాముతో తలపడేందుకు సిద్ధపడుతుంది. సమీపానికి వెళ్లగానే ఆ బల్లిని కాటేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. అయినా బల్లి లెక్కచేయకుండా పామును కొరికే ప్రయత్నం చేస్తుంది.

Viral Video: రీల్స్ కోసం నడుస్తూ వస్తున్న మహిళ.. అంతలో ఎదురుగా వెళ్లిన యువకుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

పాము కూడా బల్లిని వదలకుండా దానిపై ఎదురుదాడి చేస్తుంది. ఈ క్రమంలో చివరకు బల్లి పామును గట్టిగా కొరకగానే.. పట్టుకున్న బల్లిని వదిలేస్తుంది. తర్వాత ఆ రెండూ పోట్లాడుకునే క్రమంలో గోడ పైనుంచి కిందపడ్డాయి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ బల్లి ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కూలర్‌ని చోరీ చేయడం ఎవరి తరమూ కాదేమో.. ఇతడి ముందు జాగ్రత్త మామూలుగా లేదుగా..

Updated Date - Mar 26 , 2024 | 05:49 PM