Share News

AP Politics: దేవినేని ఉమాకు చంద్రబాబు కీలక బాధ్యతలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:37 PM

Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు (Devineni Uma Maheswara Rao).. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కీలక బాధ్యతలు అప్పగించారు...

AP Politics: దేవినేని ఉమాకు చంద్రబాబు కీలక బాధ్యతలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు (Devineni Uma Maheswara Rao).. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కీలక బాధ్యతలు అప్పగించారు. మైలవరం (Mylavaram) టీడీపీ టికెట్ రాకపోవడంతో ఒకింత అసంతృప్తికి లోనైన ఆయన్ను ఇప్పటికే ఒకట్రెండు సార్లు నేరుగా పిలిపించుకుని మరీ చంద్రబాబు మాట్లాడటంతో అంతా సెట్ అయ్యింది. ఇప్పుడు ఆయనకు కీలక బాధ్యతలనే అధిష్టానం ఇచ్చింది. ఇప్పటి వరకూ మైలవరం నియోజకవర్గానికే పరిమితమైన ఉమను.. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. ఈ మేరకు టీడీపీ అధికారికంగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీచేయడం జరిగింది. చంద్రబాబు ఆదేశాల మేరకు దేవినేనికి అసెంబ్లీ, విజయవాడ పార్లమెంట్ సమన్వయ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు.. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉమా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అప్పగించిన పదవితో దేవినేనికి మరిన్ని బాధ్యతలు పెరిగాయి.

తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?


టికెట్ ఎందుకివ్వలేదంటే..?

వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు కొన్ని రాజకీయ పరిణామాలతో దృష్ట్యా మైలవరం టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఉమాకు సీటు లేకుండా పోయింది. దీంతో ఒకింత అసంతృప్తికి లోనైన దేవినేని స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయడం.. ఇంటికి పిలిపించుకొని మాట్లాడటంతో పరిస్థితులన్నీ సర్దుకున్నాయి. ఆ తర్వాత వసంత, ఉమా ఇద్దరూ ఒక్కటయ్యారు. మైలవరంలో పసుపు జెండాను ఎగరేయడానికి వ్యూహ రచనలో మునిగితేలుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఉమాకు మరిన్ని బాధ్యతలు అప్పగించి.. ఉత్సాహంతో పనిచేసేలా చేసింది హైకమాండ్. తాజా పరిణామంతో దేవినేని చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక ఆయన అనుచరులు, అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అంతేకాదు.. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత కీలక పదవి కూడా ఇస్తానని చంద్రబాబు నుంచి హామీ వచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

AP Elections: ఓరి బాబోయ్.. వైఎస్ జగన్ రెడ్డి కడపకు వెళ్లొచ్చాక సీన్ మొత్తం మారిపోయిందే..!

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


Updated Date - Mar 29 , 2024 | 01:37 PM