Share News

Jagan Vs CBN: ‘ఎంత నీచం’ అంటూ జగన్‌కు చంద్రబాబు దిమ్మదిరిగే కౌంటర్

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నేతలు, అభ్యర్థుల మధ్య ఇలాంటి మామూలే అనుకుంటే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నామినేషన్‌కు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు..

Jagan Vs CBN: ‘ఎంత నీచం’ అంటూ జగన్‌కు చంద్రబాబు దిమ్మదిరిగే కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నేతలు, అభ్యర్థుల మధ్య ఇలాంటి మామూలే అనుకుంటే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నామినేషన్‌కు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ వైఎస్ జగన్ ఏమన్నారు..? చంద్రబాబుకు ఎందుకింత కోపమొచ్చింది..? అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.


YS-Jagan.jpg

జగన్ ఏమన్నారు..?

గురువారం నాడు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌కు ముందు భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ వారసత్వం, సోదరి షర్మిలా రెడ్డిపై సంచలన వ్యాఖ్యలే చేశారు. పేర్లు ప్రస్తావించలేదు కానీ.. పరోక్షంగా అనాల్సినవన్నీ అనేశారు. ‘వైఎస్సార్‌ వారసులమంటూ పసుపు చీరలు కట్టుకుని కొందరు వస్తున్నారు. వైఎస్సార్‌ లెగసీని దెబ్బ తీసినవాళ్లతో చేతులు కలిపిన వీళ్లా వారసులు?. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరు..? వైఎస్‌పై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టిందెవరు..? అసలు వైఎస్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చిందెవరు..? వైఎస్ పేరు, కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని.. వైసీపీకి పేరు రాకూడదని విగ్రహాలు తొలగిస్తామన్న నేతలు, ఆ పార్టీలతో చేతులు కలిపిన వాళ్లు వైఎస్ వారుసులా..? పసుపు చీర కట్టుకుని వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు.. ఆ పార్టీలో చేరిన వాళ్లు వైఎస్ వారసులా..?’ అని సభావేదికగా షర్మిలా రెడ్డిని వైఎస్ జగన్ రెడ్డి ప్రశ్నించారు.


Sharmila-And-Chandrababu.jpg

బాబు అదిరిపోయే కౌంటర్!

జగన్ కామెంట్స్ విన్న చంద్రబాబు.. ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ‘తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా.. మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా..? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?’ అంటూ ఎక్స్‌లో బాబు రాసుకొచ్చారు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఈ ట్వీట్ వ్యవహారంపై పెద్ద పోట్లాటే జరుగుతోంది. ఒకరిపై ఒకరిపై ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. తన కుమారుడు వివాహానికి ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు షర్మిల పసుపు చీరతోనే చంద్రబాబును ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన జగన్ తాజాగా కామెంట్స్ చేశారు. ఇప్పటికే వారసత్వం విషయంలో జగన్ వర్సెస్ షర్మిలగా పెద్ద ఎత్తునే మాటల యుద్ధం నడుస్తుండగా.. తాజాగా సీఎం చేసిన కామెంట్స్‌పై సోదరి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.

Read Latest Andhra Pradesh News And Telugu News


Updated Date - Apr 25 , 2024 | 01:25 PM