Share News

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:11 PM

YSR Congress: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. టికెట్లు రాలేదని కొందరు.. పార్టీకి సేవలు చేసినప్పటికీ గుర్తించలేదని మరికొందరు అధికార పార్టీకి రాజీనామాలు చేసేస్తున్నారు...

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. టికెట్లు రాలేదని కొందరు.. పార్టీకి సేవలు చేసినప్పటికీ గుర్తించలేదని మరికొందరు అధికార పార్టీకి రాజీనామాలు చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగులు, ముఖ్యనేతలు, కీలక నేతలు సైతం రాజీనామా చేసేసి బయటికొచ్చేశారు. తాజాగా.. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న కిల్లికి నాడు టికెట్ దక్కలేదు. ఎంపీ టికెట్ ఆశించి పార్టీలో చేరిన కృపారాణికి నిరాశే ఎదురైంది. ఈ 2024 ఎన్నికల్లో అయినా టికెట్ వస్తుందని ఎంతో ఆశపడ్డారు కానీ.. ఈసారి కూడా జగన్ ఝలక్ ఇచ్చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కృపారాణి వైసీపీకి రాజీనామా చేసేశారు. అయితే.. ఏ పార్టీలో చేరబోతున్నారు..? భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

టీడీపీ కీలక నేత కుమారుడికి వైసీపీ ఎంపీ టికెట్ ఆఫర్.. సీన్ కట్ చేస్తే..!?


Killi-Kruparani.jpg

రాజీనామా ఎందుకు..?

వైసీపీకి రాజీనామా చేయడం వెనుక కారణాలు కూడా కృపారాణి చెప్పుకొచ్చారు. పార్టీలో తనకు తీవ్ర అన్యాయం, అవమానం జరిగిందని ఆమె చెప్పారు. కేబినెట్ ర్యాంక్, ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చకుండా మోసం చేశారని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వైసీపీలో తనకు ఎందుకు అధ్యక్ష పదవి ఇచ్చారో.. ఎందుకు తీసేశారో తెలియదని.. పదవుల కంటే గౌరవమే ముఖ్యమని అని తేల్చిచెప్పారు. గౌరవం ఎక్కడుంటే అక్కడ తానుంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దాదాపు అన్నీ ఫిక్స్ అయిపోవడంతో.. కృపారాణి తిరిగి సొంత గూటికి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇవాళ సాయంత్రం లేదా.. రేపు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డితో భేటీ అవుతారని అనుచరులు చెప్పుకుంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మాయ చేద్దామనుకున్న జగన్‌కు భారీ ఝలక్‌

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 01:26 PM