Share News

AP Politics: టీడీపీ కీలక నేత కుమారుడికి వైసీపీ ఎంపీ టికెట్ ఆఫర్.. సీన్ కట్ చేస్తే..!?

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:55 AM

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) రెండోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికార వైసీపీ (YSR Congress).. తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కుతోంది. కూటమిని చీల్చడం వల్ల కాదని తెలుసుకున్న వైసీపీ.. ఇక టీడీపీలోని కీలక నేతల కుటుంబాలను టార్గెట్ చేస్తూ.. వారిని పార్టీలోకి లాగడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది..

AP Politics: టీడీపీ కీలక నేత కుమారుడికి వైసీపీ ఎంపీ టికెట్ ఆఫర్.. సీన్ కట్ చేస్తే..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) రెండోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికార వైసీపీ (YSR Congress).. తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కుతోంది. కూటమిని చీల్చడం వల్ల కాదని తెలుసుకున్న వైసీపీ.. ఇక టీడీపీలోని కీలక నేతల కుటుంబాలను టార్గెట్ చేస్తూ.. వారిని పార్టీలోకి లాగడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబాన్ని వైసీపీలో చేర్చుకోవాలని చూసింది కానీ.. సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అయ్యన్న కుమారుడు చింతకాయల విజయ్‌ను టీడీపీ నుంచి బయటికి లాగి.. వైసీపీ కండువా కప్పి.. ఎంపీ టికెట్ ఇవ్వాలని కొందరు అగ్రనేతలు యత్నించారు. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ మీడియా ముఖంగా చెప్పేశారు. అసలేం జరిగింది..? వైసీపీ నుంచి సంప్రదింపులు జరిపింది ఎవరు..? విజయ్ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..!

ఓరి బాబోయ్.. కొడాలి నాని జబర్దస్త్‌ను మించి కామెడీ..!


Chintakayala-Vijay.jpg

అవును.. ఆఫర్ వచ్చింది కానీ..!

తనను ఎంపీగా పోటీ చేయమని వైసీపీ నుంచి ఆఫర్‌ వచ్చిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ (Chintakayala Vijay) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడి విలేఖరులతో మాట్లాడారు. 2019లో మిధున్‌రెడ్డి (Mithun Reddy) స్వయంగా ఫోన్‌ చేసి వైసీపీ తరఫున ఎంపీగా (MP Ticket) పోటీ చేయమని అడిగారని, ఇప్పుడు కూడా సీఎం ముఖ్య సలహాదారు ఒకరు తనకు ఫోన్‌ చేసి అడిగారని చెప్పారు. టీడీపీలోనే ఉంటానని చెప్పి, తిరస్కరించానన్నారు. సిటీ క్లబ్‌లో అక్రమంగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించి, శిలాఫలకంపై పేరు వేయించుకోవడానికి ఎమ్మెల్యే గణేశ్‌కి సిగ్గుండాలని విమర్శించారు. సిటీ క్లబ్‌ షాపులకు మునిసిపాలిటీ ప్లాన్‌ ఎక్కడుందని ప్రశ్నించారు.

మాయ చేద్దామనుకున్న జగన్‌కు భారీ ఝలక్‌

Chintakayala-Vijay-1.jpg

గుర్తు లేదా..?

నర్సీపట్నంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడుని ఉద్దేశించి ఎమ్మెల్యే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, గొలుగొండ మండలం ఆరిలోక రోడ్డు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఆ రోడ్డు నిర్మాణానికి అయ్యన్నపాత్రుడే నిధులు తెచ్చారని గుర్తు చేశారు. ఓటు హక్కు లేని వారికి కండువాలు వేసి పార్టీలో చేరినట్టు గొప్పలు చెప్పుకుంటు న్నారని విమర్శించారు. రూ. 7 లక్షలు పెట్టి తాండవ రిజర్వాయర్‌ గేట్లకు మరమ్మతు చేయించలేకపోయారన్నారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాలికమల్లవరంలో తవ్వించిన రంగురాళ్లపై విచారణ చేయిస్తామని చెప్పారు.

Ayyanna-and-Chandrababu.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


Updated Date - Apr 03 , 2024 | 12:14 PM