Share News

AP Elections: ఓరి బాబోయ్.. కొడాలి నాని జబర్దస్త్‌ను మించి కామెడీ..!

ABN , Publish Date - Apr 03 , 2024 | 09:09 AM

Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయ్!. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదిగో మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) అయితే ‘నా రూటే సపరేటు’ అన్నట్లుగా నడుస్తున్నారు!. చుట్టూ వంద మంది భజన బృందం.. ప్రతి పది ఇళ్లకోసారి మంగళ హారతి..

AP Elections: ఓరి బాబోయ్.. కొడాలి నాని జబర్దస్త్‌ను మించి కామెడీ..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయ్!. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదిగో మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) అయితే ‘నా రూటే సపరేటు’ అన్నట్లుగా నడుస్తున్నారు!. చుట్టూ వంద మంది భజన బృందం.. ప్రతి పది ఇళ్లకోసారి మంగళ హారతి.. అక్కడక్కడా కాళ్లకు పాలాభిషేకం.. ఇదీ ఆయన తీరు..! ఈ కొత్త తరహా ప్రచారార్భాటంతో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే విస్మయం చెందిన పరిస్థితి. మరోవైపు.. నాని బిల్డప్‌ చూసి పట్టణవాసులు ఆశ్చర్యపోతున్నారు.

మాయ చేద్దామనుకున్న జగన్‌కు భారీ ఝలక్‌


కామెడీ.. కామెడీ!

రోజుకో రకంగా బిల్డప్‌లతో బజర్దస్త్‌ను మించిన కామెడీని ఎంజాయ్‌ చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో కొత్త ఎత్తుగడకు నాని శ్రీకారం చుట్టారు. రెండున్నరేళ్లు మంత్రిగా, మరో రెండున్నరేళ్లు ఎమ్మెల్యేగా నాని గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. ఈ విషయంలో నియోజకవర్గ ప్రజలు పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఆరు రోజులుగా ప్రచారం చేస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో తానేదో గుడివాడ అభివృద్ధి ప్రధాత అనే రేంజ్‌లో ఏకంగా వైసీపీ శ్రేణులతో పాదాలకు పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు. పార్టీ అభిమానులు, సొంత మనుషులతో డబ్బులిచ్చి పాలాభిషేకాలు తెరలేపారు. ప్రచారానికి వచ్చిన వారికి పూర్తిస్థాయిలో చికెన్‌ భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారంలో తన వెంట వందమంది ఉండేలా పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి పది ఇళ్లకు ఒకసారి హారతి పట్టేలా, మెడలో పూలదండులు వేసేలా ఏర్పాట్లు భేషుగ్గా చేసుకున్నారని గుడివాడ టాక్‌.!

Venigandla-Ramu.jpg

తిట్టిపోస్తున్నారుగా!

మహిళా వలంటీర్‌తో నాని కాళ్లు కడిగించి.. పాలాభిషేకం చేయించుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముఖానికి ముసుగేసుకుని మరీ సదరు మహిళ వలంటీర్ కొడాలి నాని కాళ్లు కడగడం గమనార్హం. కొడాలి నాని బలుపు, అహంకారానికి ఇది మరో నిదర్శనమని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం బూతులతో విరుచుకుపడే నాని మహిళల్ని చులకనగా చూస్తున్నారన్నారు. అహంకారంతో బలుపు ప్రదర్శిస్తున్న కొడాలికి ఎన్నికల్లో ఓట్ల రూపంలో మహిళలే తగిన బుద్ది బుద్ధి చెబుతారని రాము వ్యాఖ్యానించారు.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


Updated Date - Apr 03 , 2024 | 11:25 AM