Share News

AP Elections 2024: మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులపై జనసేన మల్లగుల్లాలు.. నాగబాబు సంగతేంటి..!?

ABN , Publish Date - Mar 30 , 2024 | 09:59 AM

AP Elections 2024: జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు...

AP Elections 2024: మచిలీపట్నం ఎంపీ,  అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులపై జనసేన మల్లగుల్లాలు.. నాగబాబు సంగతేంటి..!?

జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేర్లు తెరపైకి వచ్చాయి.

తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?

పెండింగ్ ఎందుకో..?

అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిని ఖరారు చేయడంలోనూ జాప్యం చోటుచేసుకుంటోంది. మచిలీపట్నం, అవనిగడ్డ స్థానాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉండటం వల్లే రెంటినీ ఆపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం ఎంపీ బరిలో బాలశౌరి కాకుండా వేరేవారు ఉంటే, ఆయన్ను అవనిగడ్డ ఎమ్మెల్యేగా బరిలో దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగానే అవనిగడ్డ స్థానాన్ని కూడా పెండింగ్‌లో పెడుతున్నారని సమాచారం. అవనిగడ్డ రేసులో ప్రముఖ వ్యాపారవేత్త విక్కుర్తి శ్రీనివాస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన పేరుతో పాటు మచిలీపట్నం జనసేన నేత బండి రామకృష్ణ, కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేర్లతో ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అధికశాతం ఓటర్లు విక్కుర్తికి మొగ్గు చూపినట్ల్లు తెలుస్తోంది. బాలశౌరి మచిలీపట్నం నుంచే బరిలో దిగేది ఖాయమైతే, అవనిగడ్డ బరిలో విక్కుర్తి ఉంటారని సమాచారం.

పిఠాపురంపై పవన్ ఫోకస్..



వీడని ఉత్కంఠ

మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానాల నుంచి బరిలో నిలిచే అభ్యర్థులపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం సమీపిస్తున్నా ఈ స్థానాల అభ్యర్థులు ఖరారు కాకపోవడం కూటమి శ్రేణుల్లో చర్చ దారితీస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలు, మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని తొలుత జనసేనకు కేటాయించారు. ఆ తర్వాత జరిగిన సర్దుబాట్లలో విజయవాడ పశ్చిమ బీజేపీ ఖాతాలో పడింది. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా యలమంచిలి సుజనా చౌదరిని ఖరారు చేశారు. ఇక జనసేన ఖాతాలో ఉన్న మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానాలపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 10:11 AM