Share News

Election Code: అమలులోకి వచ్చిన ఎలక్షన్ కోడ్.. నియమావళి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:17 PM

దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‍ప్రదేశ్, సిక్కిం, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీలకు సైతం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాయి.

Election Code: అమలులోకి వచ్చిన ఎలక్షన్ కోడ్.. నియమావళి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‍ప్రదేశ్, సిక్కిం, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీలకు సైతం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరపాలనేదే ఈసీ ప్రయత్నం అని కమిషనర్ రాజీవ్ కుమార్ ( Rajiv Kumar ) అన్నారు. జూన్‌ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, కోటీ 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నాట్లు ఈసీ వెల్లడించింది.

ఓటు వేసేందుకు 10 లక్షల 50 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా 55 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు. ప్రస్తుత లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుంది. కాగా గత లోక్‍సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడుదశల్లో పోలింగ్ నిర్వహించింది. మే23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.


సక్రమంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రచారం, పోలింగ్‌, కౌంటింగ్‌ జరగడమే ఎలక్షన్ కోడ్ ప్రధాన లక్ష్యం. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలు అమలులో ఉంటాయి. కోడ్‌ ఉల్లంఘిస్తే దర్యాప్తు జరిపి, శిక్ష విధించడానికి ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికల కోడ్ కు చట్టబద్ధత లేకపోవడంతో చట్టబద్ధత కల్పించేందుకు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ తీవ్ర కృషి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసీ ప్రకారం, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రచారానికి తమ అధికారాలను ఉపయోగించుకోకూడదని ఎన్నికల నియమావళి వివరిస్తోంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 04:18 PM