Share News

TMC: టీఎంసీకి ఎమ్మెల్యే తపాస్ రాయ్ షాక్.. ఎమ్మెల్యే పదవీ, పార్టీకి రాజీనామా

ABN , Publish Date - Mar 04 , 2024 | 02:25 PM

లోక్ సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, బరానగర్ ఎమ్మెల్యే తపాస్ రాయ్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవీతోపాటు, పార్టీకి రాజీనామా సమర్పించారు.

TMC: టీఎంసీకి ఎమ్మెల్యే తపాస్ రాయ్ షాక్.. ఎమ్మెల్యే పదవీ, పార్టీకి రాజీనామా

కోల్ కతా: లోక్ సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి (TMC) షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, బరానగర్ ఎమ్మెల్యే తపాస్ రాయ్ (Tapas Roy) రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవీతోపాటు, పార్టీకి రాజీనామా సమర్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తపాస్ రాయ్ డిప్యూటీ చీఫ్ విప్‌గా కూడా ఉన్నారు. సందేశ్ ఖాళీ ఘటనపై తపాస్ రాయ్ (Tapas Roy) అసంతృప్తితో ఉన్నారు. దాంతో తపాస్ రాయ్ పార్టీ వీడతారనే ఊహాగానాలు వచ్చాయి. జనవరిలో తపాస్ రాయ్ (Tapas Roy) ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో పార్టీ తనకు అండగా ఉండలేదని తపాస్ రాయ్ అంటున్నారు.

‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహణ తీరుతో తీవ్ర నిరాశకు గురయ్యాను. టీఎంసీ పార్టీ, ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలతో విసిగిపోయాను. సందేశ్ ఖాళి ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు అని’ తపాస్ రాయ్ పేర్కొన్నారు. ఆగ్రహంతో ఉన్న తపాస్ రాయ్‌ ఇంటికి టీఎంసీ నేతలు వెళ్లారు. అతనిని శాంతింపజేసేందుకు కునాల్ ఘోష్, బ్రత్య బసు ప్రయత్నించారు. ఆ చర్చలు ఫలించలేదు. టీఎంసీ ఉత్తర కోల్ కతా ఎంపీ సుదీప్ బందోపాధ్యాయతో తపాస్ రాయ్‌కు విభేదాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 02:25 PM