Share News

NIA Team Attacked: నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్తే ఎటాక్ చేశారు..వీడియో

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:50 PM

పశ్చిమ బెంగాల్లో ఇటివల ఈడీ బృందంపై జరిగిన దాడి ఘటన మరువక ముందే తాజాగా మరోకటి చోటుచేసుకుంది. బెంగాల్‌ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని భూపతినగర్‌లో ఈరోజు(మార్చి 6న) ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందంపై పలువురు దాడి(NIA Team Attacked) చేశారు. అయితే భూపతినగర్ పేలుడు కేసు దర్యాప్తు గురించి తెలుసుకోవడానికి ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని NIA బృందం అరెస్టు చేసింది.

NIA Team Attacked: నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్తే ఎటాక్ చేశారు..వీడియో
NIA team attacked

పశ్చిమ బెంగాల్లో(West Bengal) ఇటివల ఈడీ బృందంపై జరిగిన దాడి ఘటన మరువక ముందే తాజాగా మరోకటి చోటుచేసుకుంది. బెంగాల్‌ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని భూపతినగర్‌లో ఈరోజు(మార్చి 6న) ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందంపై పలువురు దాడి(NIA Team Attacked) చేశారు. అయితే భూపతినగర్ పేలుడు కేసు దర్యాప్తు గురించి తెలుసుకోవడానికి ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని NIA బృందం అరెస్టు చేసింది. ఆ క్రమంలో వ్యక్తిని విచారణ నిమిత్తం తీసుకెళుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పలువురు ఎన్‌ఐఏ దర్యాప్తు అధికారులను చుట్టుముట్టి ఆ వ్యక్తిని విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేశారు. దీంతోపాటు ఎన్‌ఐఏ బృందంపై ఇటుకలు, రాళ్లతో విసిరారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇద్దరు ఎన్ఐఏ అధికారులు గాయపడ్డారు.


భూపతినగర్, తూర్పు మేదినీపూర్ పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ అధికారులు విచారణ జరుపుతున్న సమయంలో సందేశ్‌ఖాలీలో నిరసనకారులను ఎదుర్కొన్నారు. ఈ కేసులో నిందితులను తమ వెంట తీసుకెళ్లకుండా ఎన్‌ఐఏ బృందాన్ని పలువురు అడ్డుకుని అధికారుల వాహనాలపై రాళ్లతో ఎటాక్ చేశారు. 2022లో జరిగిన ఈ పేలుళ్ల కేసును విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు అక్కడికి వచ్చినప్పుడు ఈ దాడి జరిగింది. అదే సమయంలో కోపోద్రిక్తులైన గుంపు NIA టీమ్ కారుపై రాళ్లను విసిరారు. దీంతో కారు విండ్‌స్క్రీన్ దెబ్బతింది. దీంతోపాటు అందులోని ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి.


దుండగులు రాళ్లదాడి చేయడంతో చాలా NIA వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల అద్దాలు పగిలిపోయాయి. ఎన్ఐఏ బృందం వెంట సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు. తర్వాత పరిస్థితి అదుపులో వచ్చిందని అధికారులు అన్నారు. దాడి అనంతరం ఎన్ఐఏ అధికారులను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. డిసెంబర్ 2022లో భూపతినగర్ పేలుడు సంభవించింది. ఈ కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ బూత్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ మన్నా, ఆయన సోదరుడు దేవ్‌కుమార్‌ మన్నా, విశ్వజిత్‌ గయెన్‌లపై ఆరోపణలు వచ్చాయి.


దీంతోపాటు భూపతినగర్ విచారణకు సంబంధించి ఎన్ఐఏ వారం క్రితం ఎనిమిది మంది తృణమూల్ కాంగ్రెస్(TMC) నేతలకు సమన్లు జారీ చేసింది. ఆ క్రమంలో నవకుమార్ పాండా, మిలన్ బార్, సుబీర్ మైతీ, అరుణ్ మైతీ అలియాస్ ఉత్తమ్ మైతీ, శివప్రసాద్ గయెన్, బలైచరణ్ మైతీ, అనుబ్రత జానా, మానవకుమార్ బారువాలను హాజరుకావాలని ఆదేశించింది. గతంలో ఈ ఎనిమిది మందికి నోటీసులు కూడా పంపగా, ఆ నోటీసుకు వారు స్పందించలేదు. వారం రోజుల క్రితం రెండోసారి నోటీసు పంపారు. అయినా కూడా పట్టించుకోక పోవడంతో అధికారులు రంగంలోకి దిగారు.


ఇది కూడా చదవండి:

Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. మీ వారితో కలిసి చుట్టేయండి


Manifesto : పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారెంటీ


పాక్‌ ఉగ్రవాదులపై ‘రా’ గురి!


మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 12:55 PM