Share News

Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. మీ వారితో కలిసి చుట్టేయండి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:14 PM

ప్రయాణం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు సమ్మర్ సెలవులు(summer holidays) వచ్చిన క్రమంలో అనేక మంది టూర్ల కోసం ప్లాన్ చేస్తుంటారు. వీకెండ్ టూర్ వెళ్లాలనుకునే వారి కోసం కూడా ఇది స్పెషల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ నుంచి గోవా(hyderabad to goa)కు అతి తక్కువ బడ్జెట్‌(low budget)లో ఎలా వెళ్లాలో ఇప్పుడు చుద్దాం.

Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. మీ వారితో కలిసి చుట్టేయండి

ప్రయాణం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు సమ్మర్ సెలవులు(summer holidays) వచ్చిన క్రమంలో అనేక మంది టూర్ల కోసం ప్లాన్ చేస్తుంటారు. వీకెండ్ టూర్ వెళ్లాలనుకునే వారి కోసం కూడా ఇది స్పెషల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ నుంచి గోవా(hyderabad to goa)కు అతి తక్కువ బడ్జెట్‌(low budget)లో ఎలా వెళ్లాలో ఇప్పుడు చుద్దాం. ఒక వ్యక్తి కేవలం వెయ్యి రూపాయల్లోనే గోవాకు వెళ్లి రావచ్చు. అవునండి బాబు, ఇది నిజం. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ప్రయాణం కోసం మీరు ముందుగా ట్రైన్ టిక్కెట్(train ticket) బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాచిగూడ నుంచి ఎలహంక(Kcg Ynk Exp) వరకు వెళ్లే రైలు గోవా మీదుగా వెళుతుంది. అందుకోసం 17 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇక టిక్కెట్ ధర విషయానికి వస్తే స్లీపర్ క్లాస్ విభాగంలో ఒక వ్యక్తికి 425 రూపాయలు భారతీయ రైల్వే ఛార్జ్ చేస్తుంది. మీరు తిరుగు ప్రయాణానికి కూడా టిక్కెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ లెక్కన మీరు ఎంచక్కా వెయ్యి రూపాయలలోపే గోవా వెళ్లి తిరిగి రావచ్చు.


ఈ ట్రైన్ వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఇద్దరు, ముగ్గురు స్నేహితులు(friends) కలిసి వెళ్లినా కూడా మూడు వేల రూపాయలలోపే అవుతుంది. ఇక అక్కడ ఖర్చులు ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఖర్చుపెట్టుకోవచ్చు. అయితే గోవా టూర్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి కొన్ని రోజుల ముందుగానే మీరు టిక్కెట్లు బుక్ చేసుకుంటే మీకు ఈజీగా రిజర్వ్ అవుతాయి. దీంతో సులభంగా తక్కువ రేటుతో గోవా టూర్(goa tour) వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు.


ఇది కూడా చదవండి:

Shaktikanta Das: ఈరోజు RBI మానిటరీ పాలసీలో తీసుకున్న నిర్ణయాలివే

SBI: ఈ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా అదనపు ఆదాయం పొందండి


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 10:30 AM