Share News

Arvind Kejriwal: జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న కేజ్రీవాల్‌కు మరో షాక్?

ABN , Publish Date - Apr 06 , 2024 | 09:56 AM

ఢిల్లీ సీఎం(delhi cm) అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను తన లాయర్‌తో కలిసేందుకు అనుమతి కోరుతూ వచ్చిన దరఖాస్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టులో వ్యతిరేకించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నందున ఆయనకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేమని ఈడీ స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు ఈడీ ఈ వాదనలు చేసింది.

Arvind Kejriwal: జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న కేజ్రీవాల్‌కు మరో షాక్?
delhi cm arvind kejriwal

ఢిల్లీ సీఎం(delhi cm) అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను తన లాయర్‌తో కలిసేందుకు అనుమతి కోరుతూ వచ్చిన దరఖాస్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టులో వ్యతిరేకించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నందున ఆయనకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేమని ఈడీ స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు ఈడీ ఈ వాదనలు చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ దరఖాస్తుపై ఉత్తర్వులను కోర్టు సోమవారానికి రిజర్వ్ చేసింది. అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వారానికి ఒక గంట సమావేశ సమయం సరిపోదని కేజ్రీవాల్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.


సంజయ్ సింగ్‌పై ఐదు లేదా ఎనిమిది కేసులున్నప్పటికీ ఆయనను కలిసేందుకు మూడుసార్లు అనుమతించామని ఈడీ(ED) తెలిపింది. ఇది జైలు నిబంధనలను ఉల్లంఘించడమేనని, ప్రతివారం ఐదుసార్లు తన లాయర్‌ను కలిసేందుకు అనుమతించాలన్న కేజ్రీవాల్(Arvind Kejriwal) అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. అయితే సాధారణంగా ఒక సమావేశానికి మాత్రమే అనుమతి ఉంటుందని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. ఒక వ్యక్తి జైలులో ఉన్నప్పుడు అతనిని ఇతర ఖైదీల వలె సమానంగా చూస్తామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వారానికి రెండు సార్లు కలిసేందుకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు, బయటి ప్రపంచంతో కలవడానికి పరిమితులు ఉంటాయని తెలిపారు.


ఢిల్లీ ముఖ్యమంత్రి(delhi cm) వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు ఎదుర్కొంటున్నందున వారానికి రెండుసార్లు తన న్యాయవాదిని కలవడం సరిపోదని, సంప్రదింపులకు మరింత సమయం కావాలని ఆప్ పిటిషన్‌లో పేర్కొంది. న్యాయవాదిని వారానికి రెండుసార్లు కలిసేందుకు కేజ్రీవాల్‌కు ఇప్పటికే కోర్టు అనుమతినిచ్చింది. కానీ ఇప్పుడు ఐదు సార్లు కలిసేందుకు పర్మిషన్ కావాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.


ఇది కూడా చదవండి:

Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. మీ వారితో కలిసి చుట్టేయండి


Manifesto : పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారెంటీ


పాక్‌ ఉగ్రవాదులపై ‘రా’ గురి!


మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 11:10 AM