Share News

Supreme Court: సుప్రీంకోర్టులో హిమాచల్ రెబల్ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ.. అనర్హతపై స్టే విధించేందుకు నో

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:29 PM

హిమాచల్ ప్రదేశ్ రెబల్ ఆరుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతపై స్టే విధించాలని కోరగా, సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

Supreme Court: సుప్రీంకోర్టులో హిమాచల్ రెబల్ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ.. అనర్హతపై స్టే విధించేందుకు నో

ఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ (Speaker) అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. అనర్హతపై స్టే విధించాలని కోరగా, సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం నిరాకరించింది. సభలో ఓటు వేసేందుకు లేదా సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించింది. రెబల్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే (Harish Salve) వాదనలు వినిపించారు.

ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వీకి ఓటు వేయలేదు. బీజేపీ నేత హర్ష్ మహాజన్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దాంతో హర్ష్ మహాజన్ గెలుపొందారు. క్రాస్ ఓటింగ్ వేసిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌ను కోరింది. ఆరుగురు సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టును రెబల్ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 03:41 PM