Share News

Ram Mandir: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది: ప్రధాని మోదీ

ABN , Publish Date - Jan 22 , 2024 | 07:21 AM

అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో యావత్ దేశమంతా ఆధ్మాత్మికత సంతరించుకుంది.

 Ram Mandir: రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది: ప్రధాని మోదీ

అయోధ్య: అయోధ్యలో (Ayodhya) రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో యావత్ దేశమంతా ఆధ్మాత్మికత సంతరించుకుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు స్థానిక ఆలయాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతోన్న వేళ ప్రధాని మోదీ భావొద్వేగానికి గురయ్యారు. ‘బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని పెంపొందిస్తుంది. భారతదేశ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుతుంది అని’ ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో ప్రధాని మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు. ఆ వెంటనే ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు పేజీల లేఖ రాశారు. ‘దేశంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రామ మందిర ప్రతిష్ఠాపన భారత అంతర్మాతకు ప్రతిబింబం. ఆ ఘట్టాన్ని చూడటం భారతీయులందరీ అదృష్టం. ఆలయం కోసం ప్రధాని మోదీ చేసిన 11 రోజుల అనుష్ఠాన దీక్ష పవిత్ర కార్యక్రమం. రాముని పట్ల ఆయనకు ఉన్న భక్తికి నిదర్శనం అని’ లేఖలో రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 22 , 2024 | 07:28 AM