Share News

Arvind Kejriwal arrest: కేజ్రీవాల్‌కు ఇండియా కూటమి మద్దతు.. నేడు కుటుంబ సభ్యులను కలవనున్న రాహుల్

ABN , Publish Date - Mar 22 , 2024 | 07:52 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన రాహుల్.. అధైర్యపడొద్దని, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Arvind Kejriwal arrest: కేజ్రీవాల్‌కు ఇండియా కూటమి మద్దతు.. నేడు కుటుంబ సభ్యులను కలవనున్న రాహుల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన రాహుల్.. అధైర్యపడొద్దని, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మరోవైపు ఇండియా కూటమి నేతలు కేజ్రీవాల్‌(Kejriwal)కు మద్దతు ప్రకటిస్తున్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ తయారీలో ఆప్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలపై సీబీఐ విచారణ చేస్తోంది. మరోవైపు ఇదే కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయగా.. నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ అక్రమమని ఆప్‌తో పాటు ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు.

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నేడు ఆప్ నిరసనలు..

కుటుంబ సభ్యులను కలవనున్న రాహుల్..!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు కలిసే అవకాశాలున్నాయి. కేజ్రీవాల్‌కు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఆప్ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. దీంతో కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఇదే కేసులో అరెస్టైన తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను కాంగ్రెస్ సమర్థించింది. తాజాగా కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకించడంతో ఎన్నికల వేళ రాజకీయంగా బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

తేజస్వి యాదవ్ మద్దతు..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మద్దతుగా నిలిచారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని బీజేపీ ఈ ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 07:59 AM